Breaking News

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ఉండాల్సిందే 

Published on Fri, 12/23/2022 - 01:48

సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని, నూతన పార్లమెంట్‌కు ఆయన పేరు పెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆర్‌.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని పరశురామ్‌ చేస్తున్న ఉద్యమం చాలా గొప్పది కాబట్టి.. ఈ అంశంపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జేరిపోతుల పరశురామ్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం, అంబేడ్కర్‌పై అభిమానం ఉంటే పార్లమెంట్‌లో వెంటనే బిల్లు పెట్టి అమలు చేయాలని.. లేని పక్షంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.  

Videos

చంద్రబాబు కు పోతిన మహేష్ వార్నింగ్

నకిలీ బంగారంతో ఘరానా మోసం

కూటమి నేతలు దిగజారిపోతున్నారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ పై సీరియస్

రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, అరెస్ట్

Exclusive Interview: నేను సంపాదించిన డబ్బులో కొంత ఛారిటీకే

పవన్ పై పిఠాపురం రైతులు ఫైర్

వల్లభనేని వంశీ కేసు కోసం ఢిల్లీ బాబాయ్ కి 2 కోట్లు ఖర్చుపెట్టారు..

భారతీయులకు ట్రంప్ మరో షాక్..

Big Question: ఏపీలో పిచ్చి కుక్కలా రెడ్ బుక్.. హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు

Magazine Story: నాడైనా, నేడైనా నేనే లిక్కర్ బాద్ షా..!

Photos

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)