Breaking News

హైదరాబాద్: నగరానికి పెళ్లి కళ! 17, 18 తేదీల్లో బలమైన ముహూర్తాలు..

Published on Tue, 08/06/2024 - 12:02

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. ఆషాఢ మాసం వెళ్లి శ్రావణం రావడంతో  శుభకార్యాలకు మంచి ముహూర్తాలు కూడా వచ్చేశాయి. దీంతో ఈ నెలలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నట్లు పురోహితవర్గాలు అంచనా వేస్తున్నాయి. కొంతకాలంగా ఎలాంటి పెళ్లిళ్లు, వేడుకలు లేకుండా ఉన్న పురోహితులు ఈ నెల రోజుల పాటు బిజీ బిజీగా గడపనున్నారు.

ఈ నెల 7 నుంచి 28 వరకూ అన్నీ మంచి ముహూర్తాలే అయినా 17, 18 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ రెండు రోజుల పాటు నగరంలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం  ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో  ఫంక్షన్‌హాళ్లు, కల్యాణమండపాలు, హోటళ్లకు  బుకింగ్‌ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే భాజాభజంత్రీలు, మండపాలను అలంకరించేవారికి, కేటరింగ్‌ సంస్థలకు సైతం ఆర్డర్లు పెరిగినట్లు అంచనా. ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు ప్రముఖ పురోహితుడు చిలకమర్రి శ్రీనివాసాచార్యులు  తెలిపారు.

15వ తేదీ నుంచి అన్నీ దివ్యమైన ముహూర్తాలే అని చెప్పారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైనదని పేర్కొన్నారు. ఈ నెలలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్న దృష్ట్యా మార్కెట్‌లో సైతం సందడి పెరిగింది. వస్త్రదుకాణాలు, బంగారం దుకాణాల్లో అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల బంగారం ధరలు కూడా కొంత వరకూ తగ్గడం వల్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవి చదవండి: ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కు హైదరాబాద్‌ నగరం ‘సోల్‌ సిటీ’.. : స్టార్ డిజైనర్ ఓస్వాల్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)