రూ. 2 లక్షలపైన రుణమాఫీ లేదు: తుమ్మల నాగేశ్వరరావు

Published on Sun, 03/23/2025 - 05:35

సాక్షి, హైదరాబాద్‌: ‘రైతు రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం రూ. 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ. రూ. 2 లక్షలపైన మాఫీ లేదు. కుటుంబానికి రూ. 2 లక్షలలోపు రుణం ఉన్న వాటిని మాఫీ చేస్తామన్నాం. ఇలాంటి కుటుంబాలు 25 లక్షలు ఉన్నట్లు మాకు వివరాలు అందాయి. ఆయా కుటుంబాలకు రూ. 20,616 కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళపడి రైతులను గందరగోళం చేయొద్దు’అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

వ్యవసాయం, అనుబంధ రంగాలు, పశుసంవర్థక శాఖ పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆది శ్రీనివాస్‌ మహేశ్వర్‌రెడ్డి సహా మొత్తం 13 మంది సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులపై రుణభారం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రుణమాఫీని ప్రధానాంశంగా తీసుకుందన్నారు. అలాగే రైతు భరోసా కోసం రూ. 7,625 కోట్లు విడుదల చేశామని.. ఈ పంటకు కూడా రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు. 

ప్రభుత్వంపై భారం పడినా రైతులకు ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులను ప్రోత్సహించడంతోపాటు కౌలు రైతులకు మేలు చేసేందుకే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్‌ ఇస్తున్నామన్నారు. సన్నాలకు ఇప్పటివరకు రూ. 1,200 కోట్ల మేర బోనస్‌ ఇచ్చినట్లు తుమ్మల వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నాల సాగు 25 శాతం నుంచి 45 శాతానికి పెరిగిందన్నారు. 

ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. పంట నష్టపరిహారం ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని.. రైతులు నష్టపోయిన పూర్తి పంటకు కూడా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. భవిష్యత్తులో బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, రైతు రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

రుణమాఫీపై కాంగ్రెస్‌ మోసం బట్టబయలు: హరీశ్‌రావు 
రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ మోసం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ ‘రూ. 2 లక్షలు పైబడిన రైతు రుణాలను మాఫీ చేయలేమని వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడం సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలకు.. చేతలకు పొంతన లేదని రుజువు చేసింది. సీఎం మాటలు నమ్మి రూ. 2 లక్షలు పైబడిన రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించిన రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. 

అలాగే రూ. 2 లక్షలలోపు తీసుకున్న రుణం ఇంకా మాఫీ కాక చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాల్లోని లోపాలను సవరించకుండా రైతులపైనే నెపం నెట్టి రుణమాఫీ నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన విధంగా రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)