Breaking News

కుదేలైన వ్యవసాయం.. రైతుల బతుకులపై నీళ్లు! 

Published on Thu, 08/03/2023 - 05:35

నాటు వేసిన పొలం ఇసుకలో మునిగింది 
► రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ మధ్యనే వరి నాట్లు వేయించా. భారీ వర్షాలతో పాలేరు రిజర్వాయర్‌ అలుగు పోసింది. 
ఆ వరదతో పొలం మునిగి ఇసుక మేట వేసింది. రూ.40 వేల వరకు పెట్టిన పెట్టుబడి వరద పాలైంది. ఈ ఇసుకను తీయడానికి, మళ్లీ సాగు చేయడానికి అప్పు తేవాల్సిందే. 
– భూక్యా ఉపేందర్, హాట్యతండా, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు కురిసిన భారీ వర్షాలు వేల గ్రామాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉప నదులు, వాగులు ముంచెత్తి రైతుల ఆశలపై నీళ్లుచల్లాయి. రెండేళ్ల కిందటి షాక్‌ నుంచి రైతులు పూర్తిగా కోలుకోకముందే.. మొలక దశలోని పంటలను వరదలు తుడిచిపెట్టాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోటెత్తిన గోదావరి, ఉప నదులతో పొలాల్లో భారీగా ఇసుక మేటలు పడ్డాయి. నది సమీప మండలాల ప్రజలను కదిలిస్తే కన్నీరే ఎదురవుతోంది. 

ఇంకా తేరుకోని జనం..: భారీ వర్షాలు, వరదల నష్టం నుంచి బాధితులు ఇంకా కోలుకోలేదు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల పొలాలు కోతకు గురై, ఇసుక మేటలు వేసి, ఇప్పట్లో పంట వేయలేని స్థితికి చేరాయి. మరో నెల రోజుల్లో పంటలు వేయకపోతే ఈ వానాకాలం సీజన్‌లో ఇక సాగు చేయడం కుదరదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే రెండు నెలలుగా దుక్కులు, విత్తనాలు, నార్లు పోయడానికి ఎకరానికి సగటున రూ.18 వేల వరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొండాయి, మోరంచపల్లి తదితర పల్లెలు ఘొల్లుమంటున్నాయి. వరదలతో పాడి పశువులతోపాటు ఇళ్లు, ఆస్తులను కోల్పోయి రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. 

ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.60 కోట్ల నష్టం 
ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌డీపీసీఎల్‌) పరిధిలోని 16 జిల్లాల్లో వర్షాల వల్ల రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. సుమారు 20 వేల విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినగా.. 3,200 ట్రాన్స్‌ఫార్మర్లు, 140 సబ్‌స్టేషన్లు నీటమునిగాయి. 742 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇందులో 3 గ్రామాలకు తప్ప అన్నింటికీ విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. 

సర్వస్వం కోల్పోయి.. 
ములుగు జిల్లా కొండాయిలో ప్రజలు వరదలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కొత్తూరుకు పరుగులు పెట్టారు. వరద తగ్గాక నేలకూలిన ఇళ్లు, మొండిగోడలు, తడిసిన బియ్యం, కొట్టుకుపోయిన సామగ్రిని చూసి గుండెలవిసేలా ఏడ్చారు. గ్రామానికి చెందిన గిరిజన రైతు దంపతులు బొల్లికుంట లక్ష్మి, ధనుంజయలకు చెందిన రెండెకరాల వరి నారు పూర్తిగా కొట్టుకుపోయింది. రెండు దుక్కిటెద్దులు గల్లంతయ్యాయి. ఇల్లు దెబ్బతిన్నది. చేతిలో చిల్లిగవ్వలేదు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతో బతుకుతున్నామని వారు చెప్తున్నారు. 

నారుపోయి.. ఇసుక చేరి.. 
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు దేవేందర్‌గౌడ్‌. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం. వ్యవసాయమే జీవనాధారం. ఇటీవలే మూడెకరాల్లో వరి నాట్లు వేశారు. కానీ మోరంచవాగు వరదతో వరి నారు పూర్తిగా కొట్టుకుపోయింది. పొలంలో ఇసుక మేటలు వేసింది. దీంతో ఈసారి పంట వేయలేని పరిస్థితి నెలకొందని దేవేందర్‌గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈయన ఒక్కడే కాదు.. మోరంచపల్లిలో మరికొందరు రైతులదీ ఇదే గోస. 

 చిరువ్యాపారం.. చిన్నాభిన్నం 
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు దొడ్ల ప్రేమలీల. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవిస్తోంది. గత నెల 28న రాత్రి పోటెత్తిన వరదలో సుమారు రూ.3 లక్షల విలువైన కిరాణా సామగ్రి, వస్తువులు కొట్టుకుపోయాయి. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె వాపోతున్నారు. 

మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలంలోని అవుతాపురం, రాజ్‌మాన్‌సింగ్‌ తండా, పోచంపల్లి, గంట్లకుంట, రంగాపురం వరకు రూ.8.70 కోట్లతో సుమారు 11 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. 2023 జనవరిలో ఇది పూర్తి కావాల్సి ఉన్నా జాప్యమైంది. ఇటీవలి భారీ వర్షాలతో పోచంపల్లి గ్రామ పరిధిలో ఇలా రోడ్డు కొట్టుకుపోయింది. 
 
మూడెకరాల్లో ఇసుక మేటలు వేసింది 
నా వ్యవసాయ భూమి పెద్దవాగు సమీపంలోని ఉంది. భారీ వర్షాలకు చెక్‌డ్యాం తెగి వరద పొలాన్ని ముంచేసింది. రూ.50వేలకుపైగా నష్టపోయా. 2021లోనూ నాతోపాటు అనేక మంది రైతులు ఇలాగే చెక్‌డ్యాం తెగి నష్టపోయారు. ఇప్పుడు అదే పునరావృతమైంది. 
– నవీన్‌ యాదవ్, రైతు, సుంకేటు, నిజామాబాద్‌ జిల్లా  

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)