Breaking News

‘డీప్‌ఫేక్’ నుంచి ‘సేఫ్‌ వర్డ్‌’ రక్షణ: సీపీ సజ్జన్నార్‌

Published on Tue, 10/28/2025 - 17:00

హైదరాబాద్‌: ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సైబర్‌ మోసాలు అధికం అయిపోయాయని, ముఖ్యంగా ఏఐ, డీప్‌ ఫేక్‌ క్లోనింగ్‌లతో ఆధునిక తరహా మోసాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ‘సేఫ్‌ వర్డ్‌’తో రక్షణ పొందాలని హైదరాబాద్‌ నగర సీపీ సజ్జన్నార్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

డీప్‌ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్‌ వర్డ్‌’ఉపయోగించాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణలో డీప్‌ ఫేక్‌, సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వీటి బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన పరిచయస్తుల నడుమ‘సురక్షిత పదం’ (సేఫ్‌ వర్డ్‌)ను ఉపయోగించాలన్నారు. మంగళవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో నగర సీపీ సజ్జన్నార్‌..ఏఐ సాధనాలు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో ముఖాలు, గొంతులను  క్లోనింగ్ చేయగలవన్నారు. దీంతో మోసగాళ్లు మన స్నేహితులు, సహోద్యోగులు లేదా అధికారుల మాదిరిగా కూడా నటించగలరని సజ్జనార్ హెచ్చరించారు. ఏఐ,డీప్‌ఫేక్‌ల యుగంలో ‘సురక్షిత పదం’ బలమైన రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
 

కుటుంబ సభ్యులు, నమ్మకమైన పరిచయస్తులతో ఒక ప్రత్యేకమైన భద్రతా పదాన్ని రూపొందించుకోవాలి, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు దానిని ఉపయోగించి, ఏవైనా అనుమానాస్పద కాల్‌లు లేదా సందేశాలను ధృవీకరించాలని ఆయన సూచించారు. డీప్‌ఫేక్ అనుకరణలకు సంబంధించిన సైబర్ ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయని సజ్జన్నార్‌ పేర్కొన్నారు. స్కామర్లు క్లోన్ చేసిన వాయిస్‌లు, వీడియోలను ఉపయోగించి డబ్బు లేదా సున్నితమైన డేటాను అత్యవసరంగా బదిలీ చేయాలని డిమాండ్ చేస్తారని హెచ్చరించారు. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా  ఇటువంటి మోసపూరిత కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రజల మధ్య డిజిటల్ అక్షరాస్యత ప్రచారాలను సైబర్ క్రైమ్ యూనిట్లు ముమ్మరం చేశాయి.

ఇది కూడా చదవండి: ఢిల్లీ విమానాశ్రయం వద్ద బస్సులో మంటలు

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?