Breaking News

Afzalgunj Incident: చెన్నైకి చెక్కేశారు!

Published on Thu, 01/30/2025 - 08:20

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలోని బీదర్‌తో పాటు నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన బీహార్‌ నేరగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్లు రోషన్‌ ట్రావెల్స్‌ వద్ద కాల్పుల తర్వాత తిరుమలగిరి నుంచి ఉత్తరాదికి పారిపోయి ఉంటారని అధికారులు భావించారు. అయితే పోలీసుల్ని తప్పుదోవపట్టిస్తూ చెన్నైకి పారిపోయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిందని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ బుధవారం పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పట్టుకుంటామని, ప్రత్యేక బృందాలు ఆ కోణంలోనే ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. బీహార్‌లోని హాజీపూర్‌ జిల్లాకు చెందిన ఇరువురు దుండగులు అక్కడ నుంచే ద్విచక్ర వాహనం తీసుకుని నగరానికి చేరుకున్నారు. ఇక్కడే ఓ లాడ్జిలో బస చేసి బీదర్‌లో రెక్కీ నిర్వహించి మరీ పంజా విసిరింది. 

ఆపై నగదుతో సహా నగరానికి చేరుకున్న ఇరువురూ బైక్‌ను ఎంజీబీఎస్‌ పార్కింగ్‌లో పెట్టారు. ఆటోలో బయలుదేరి అఫ్జల్‌గంజ్‌లోని రోషన్‌ ట్రావెల్స్‌ వద్దకు వచ్చారు. ప్రైవేట్‌ బస్సులో రాయ్‌పూర్‌కు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న తదనంతర పరిణామాలతో మేనేజర్‌ జహంగీర్‌ను కాల్చడం, పారిపోవడం జరిగాయి. దర్యాప్తు అధికారులు నిందితుల రాకపోకలు కనిపెట్టడానికి వందల సంఖ్యలో సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి ఆటోలో సికింద్రాబాద్‌కు వెళ్లిన ద్వయం..అక్కడి నుంచి మరో ఆటోలో గజ్వేల్‌ వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఆటోడ్రైవర్‌ వ్యవహార శైలితో అనుమానించి తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడే నగదును మరో బ్యాగ్‌లోకి మార్చడంతో పాటు తాము ధరించిన వ్రస్తాలను మార్చుకున్నారు. 

అక్కడ నుంచి బోయిన్‌పల్లి వరకు వచ్చిన ఇద్దరు దుండగులూ..మరో ఆటోలో కూకట్‌పల్లి మీదుగా మియాపూర్‌ చేరుకున్నారు. అర్ధరాత్రి మియాపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆరీ్టసీకి చెందిన తిరుపతి వెళ్లే బస్సు ఎక్కారు. టిక్కెట్‌ సైతం తిరుపతి వరకు తీసుకున్న ఈ ద్వయం.. కడప బైపాస్‌ రోడ్డులో దిగిపోయారు. ఆ సమయంలో డ్రైవర్‌ ఇక్కడ ఎందుకు దిగుతున్నారని ప్రశి్నంచగా..పని ఉందంటూ సమాధానం ఇచ్చారు. కడప నుంచి మరో బస్సులో నెల్లూరు, అక్కడ నుంచి ప్రైవేట్‌ బస్సులో చెన్నై చేరుకున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు.

 చెన్నై చేరుకున్న నగర పోలీసు బృందాలు అక్కడ నుంచి ఈ ఇద్దరూ ఎక్కడకు వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నాయి. ఈ ఇద్దరిలో కీలకమైన ప్రధాన నిందితుడు ఏడాదిన్నర క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ ఓ భారీ నేరం చేశాడు. అప్పటి నుంచి ఇతడి కోసం గాలిస్తున్న అక్కడి స్పెషల్‌ టాస్‌్కఫోర్స్‌ అధికారులు ఆచూకీ చెప్పిన వారికి రూ.4 లక్షల పారితోíÙకం కూడా ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ దుండగుల కోసం తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్‌ పోలీసులు సమన్వయంతో గాలిస్తున్నారు.   

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)