Breaking News

నేను.. పక్కా లోకల్‌

Published on Tue, 04/23/2024 - 10:21

కరీంనగర్‌: ‘నేను పక్కా లోకల్‌.. రూ.12 వేల కోట్ల నిధులతో కరీంనగర్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశా’నని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. హుస్నాబాద్‌లో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ముందుగా గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి స్వాగతం పలికారు. సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు అభ్యర్థులు దొరకక, బయటి ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారన్నారు.

గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదని, అందుకే మాజీ సర్పంచ్‌లు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కరెంట్‌ బిల్లులను కట్టిందన్నారు. పల్లెల అభివృద్ధికి పాటుపడిన సర్పంచ్‌లను నిలువునా మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు.

కరీంనగర్‌ ఎంపీగా నన్ను ఓడించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ‘హుస్నాబాద్‌ ఎమ్మెల్యే నన్ను వెధవ అంటున్నారు. ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఆయన నన్ను ఎంత తిట్టినా పడతా’నని బండి అన్నారు. హామీలపై మొదట శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్‌ నాయక్, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కేసీఆర్‌ లాంటి దొరలే..!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)