Breaking News

కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

Published on Mon, 01/06/2025 - 17:21

సాక్షి,హైదరాబాద్‌:ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సోమవారం(జనవరి6) సాయంత్రం ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల తొమ్మిదో తేదిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. ఏసీబీ అధికారులు కేటీఆర్‌ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. అం‍తకు ముందు ఏసీబీ కేటీఆర్‌ ఇంట్లో తనిఖీలు చేసింది.  సోమవారం ఉదయమే కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు తనతో పాటు న్యాయవాదులను అనుమతించకపోవడంతో బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయం బయట నుంచే కేటీఆర్‌ విచారణకు వెనుదిరిగారు. 

తాను చెప్పాలనుకున్నది రాతపూర్వకంగా పోలీసులకు సమర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ తాను లేనప్పుడు తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తోందని, సీఎం రేవంత్‌ ఆదేశాలతో కావాలని ఏదైనా పెట్టి  నా ఇంట్లో దొరికినట్లు చూపించాలనుకుంటున్నారని చెప్పడం గమనార్హం. క్వాష్‌ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్‌ అయిందని అయినా ఏసీబీ కావాలని తనను విచారణకు పిలుస్తోందని మండిపడ్డారు. 

కాగా, ఫార్ములా-ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు హైకోర్టులో ఇప్పటికే ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. క్వాష్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. 

ఇదీ చదవండి: రేవంత్‌ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)