Breaking News

 నీరు లేదు.. వాన నీరే..

Published on Wed, 07/26/2023 - 03:53

నార్నూర్‌(ఆదిలాబాద్‌): ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులుగా నీటి వసతిలేక 367 మంది విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవు­తున్నారు. ఆదుకునేనాథుడే లేక వారికి వానదేవుడే దిక్కు అయ్యాడు. కొద్దిరోజులుగా నిల్వ చేసుకున్న వాననీటితోనే స్నానాలు చేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇదీ ఆదిలాబాద్‌ జిల్లా గాది­గూడ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలి­కల విద్యాలయం, కళాశాల దుస్థితి. వంట చేయ­డానికి నీళ్లు లేక వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు.

సమస్యను ఎస్‌వో ప్రియాంక సర్పంచ్‌ మెస్రం జైవంత్‌రావు దృష్టికి తీసుకెళ్లగా రెండ్రోజులు గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ద్వారా నీరు సరఫరా చేశారు. తర్వాత పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది దీంతో విద్యార్థినులు ఇంటిబాట పడుతు­న్నారు. నీటిసమస్యను డీఈవో ప్రణీత, కేజీబీవీ జిల్లా సెక్టోరియల్‌ అధికారి ఉదయశ్రీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విద్యార్థినులు అంటున్నారు. కలెక్టర్‌ స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపా­లని కోరుతున్నారు. రెండ్రోజుల్లో నీటిసమస్య పరిష్కరించకుంటే కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్తామని పేర్కొన్నారు.

Videos

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)