‘మమ్మీ బాయ్‌..’

Published on Wed, 01/29/2025 - 07:34

ఫిలింనగర్‌: ‘మమ్మీ బాయ్‌..’ అంటూ తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరిన చిన్నారిని అక్రమంగా నగరంలోకి ప్రవేశించిన లారీ బలితీసుకుంది. తన కళ్లెదుటే కుమార్తె లారీ చక్రాల కిందపడి ఛిద్రం కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన ఫిల్మ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని షేక్‌పేట ప్రధాన రహదారిలో మంగళవారం చోటు చేసుకుంది. షేక్‌పేట మై హోం రెయిన్‌ బో రెసిడెన్స్‌లో నివసించే గడ్డం హేమ సుందర్‌రెడ్డి కుమార్తె అథర్వి (10) మణికొండలోని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఐదో తరగతి చదువుతోంది.

 ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8.00 గంటల సమయంలో హేమ సుందర్‌రెడ్డి తన కుమార్తెను స్కూల్‌లో దింపడానికి యాక్టీవా వాహనంపై బయలుదేరారు. వీరి వాహనం 8.10 గంటలకు షేక్‌పేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో వెనుక వైపు నుంచి చక్కెర లోడ్‌తో వచి్చన లారీ హేమ సుందర్‌రెడ్డి నడుపుతున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ధాటికి తండ్రీకుమార్తె వాహనం పైనుంచి ఇద్దరు కిందపడ్డారు. అథర్వి లారీ వెళ్తున్న వైపు పడటంతో దాని వెనుక చక్రాలు ఆమె పైనుంచి వెళ్లాయి. దీంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయింది. 

హేమ సుందర్‌రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ప్రాంతంలోని రోడ్డంతా రక్తసిక్తమైంది. మరికొద్దిసేపట్లో కూతుర్ని స్కూల్‌ దగ్గర దింపాల్సి ఉండగా కళ్లెదుటే ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఆయన జీరి్ణంచుకోలేకపోయారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న అథర్వి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేని వేళల్లో అక్రమంగా సిటీలోకి లారీతో ప్రవేశించి, చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌ యాసిన్‌ ఖురేషిని అరెస్ట్‌ చేశారు.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)