Breaking News

3 నెలల్లో లక్ష దరఖాస్తులు

Published on Thu, 06/13/2024 - 04:19

సాక్షి, హైదరాబాద్‌: తమ భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధరణి పోర్టల్‌కు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. గత మూడు నెలల్లోనే లక్ష దరఖాస్తులు అందాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి లక్షల సంఖ్యలో దరఖాస్తులు పరిష్కరించినా, మళ్లీ ధరణి పోర్టల్‌లో దరఖాస్తుల సంఖ్య మొత్తం 2 లక్షలకు చేరినట్టు తెలుస్తోంది. 

ఈ ఏడాది మార్చి మూడో వారంలో ఎన్నికల కోడ్‌ అడ్డంకితో డ్రైవ్‌ ఆగిపోయినప్పటి నుంచి ఇటీవలి వరకు కొత్తగా లక్ష దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పురోగతిని పరిశీలించడంతో పాటు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుంది.  

ధరణి కమిటీ చొరవతో.. 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2.45 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్ల పని ఒత్తిడికి తోడు పోర్టల్‌లోని సాంకేతిక కారణాలతో చాలా దరఖాస్తులు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండిపోయాయి. దీంతో ధరణి పోర్టల్‌ను సంస్కరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ చొరవతో ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ఈ ఏడాది మార్చినెల మొదటి వారంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అదే నెలలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రావడంతో స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. 

సాధారణ ప్రక్రియలో భాగంగా అడపాదడపా పరిష్కరించిన కొన్ని దరఖాస్తులు కలిపి మొత్తం 1.5 లక్షల దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా మిగిలిన దాదాపు లక్ష దరఖాస్తులకు తోడు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ధరణి పోర్టల్‌కు వచ్చిన మరో లక్ష కలిపి ఇప్పుడు పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య మొత్తం 2 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో సీసీఎల్‌ఏ మిత్తల్‌ శుక్రవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విడతల వారీగా ఒక్కోసారి ఐదారు జిల్లాల కలెక్టర్లతో గంట పాటు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్‌తో పాటు ప్రజావాణి, గ్రీవెన్స్‌ కార్యక్రమాల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయానికి నేరుగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విషయమై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.     

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)