Breaking News

దళితులు ధనికులు కావాలె.. ఏ పార్టీ వాళ్లయినా దళితబంధు ఇద్దాం

Published on Fri, 07/07/2023 - 04:12

సిరిసిల్ల: సమాజంలో అణచివేతకు గురై, అట్టడు­గు­న ఉన్న దళితులను ధనికులను చేసే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నా­రని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పోడుభూములకు పట్టాలు, ఎస్సీ చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు.

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ దళితబంధులో తొలి విడతలో ప్రతి నియోజ కవర్గానికి 100 కుటుంబాలకు అందించామని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు అందిస్తామని తెలిపారు. ఏ పార్టీ వారైనా అందరికీ దళితబంధు ఇస్తామన్నారు.   హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ధనికులు ఏ నీళ్లు తాగుతారో.. వీర్నపల్లి తండాలోనూ అవే నీళ్లు తాగేలా ఇంటి ముందు నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామన్నారు.

కొమురం భీమ్‌ స్ఫూర్తితో జల్, జమీన్, జంగల్‌ నినాదాలతో నీళ్లు సాధించి, పోడుభూములకు పట్టాలిచ్చి, కొత్తగా 5 లక్షల ఎకరాల్లో 8 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం 9 ఏళ్లలో చేసి చూపించామని, తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్‌ వివరించారు. రైతులకు బీమా చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్‌గా మారిందని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.

వ్యవసాయ కాలేజీకి బాబూ జగ్జీవన్‌రామ్‌ పేరు
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు బాబూ జగ్జీవన్‌రామ్‌ కళాశాలగా నామకరణం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. 128 మంది ఎస్సీ చిరువ్యాపారులకు రూ.62 లక్షల మేరకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 1,614 మంది గిరిజనులకు 2,558.34 ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, టీపీటీడీసీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)