Breaking News

టీమిండియాకు ఘోర పరాభవం .. జింబాబ్వే చేతిలో ఓటమి

Published on Sat, 07/06/2024 - 20:18

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 

116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్‌.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. 

జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్‌ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా..  బెన్నట్‌, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

అతడితో పాటు వాషింగ్టన్ సుందర్‌(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. 

బిష్ణోయ్‌తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్‌ ఖాన్‌,ముఖేష్‌ కుమార్‌ చెరో వికెట్‌ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మ‌దండే(29), మైర్స్‌(23), బెన్నట్‌(23),  పరుగులు చేశారు. కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్‌ ఓటమి పాలవ్వడం 2016 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)