Breaking News

ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే

Published on Fri, 10/03/2025 - 10:08

భారత్‌, శ్రీలంక వేదికలుగా జరుగబోయే 2026 టీ20 ప్రపంచకప్‌కు (T20 World Cup 2026) జింబాబ్వే (Zimbabwe) అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియనల్‌ క్వాలిఫయర్స్‌ 2025లో ఫైనల్‌కు చేరడం ద్వారా ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకుంది. 

జింబాబ్వేతో పాటు నమీబియా (Namibia) కూడా ఆఫ్రికా రీజియనల్‌ క్వాలిఫయర్స్‌లో ఫైనల్‌కు చేరి ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఉగాండ చేతిలో ఓటమి కారణంగా జింబాబ్వే గత ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.

జింబాబ్వే, నమీబియా బెర్త్‌లు ఖరారు చేసుకోవడంతో ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 17కి చేరింది. ఇంకా మూడు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. ఆ మూడు జట్లు ఆసియా క్వాలిఫయర్స్‌ ద్వారా ఖరారవుతాయి.

ఇప్పటిదాకా భారత్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.

ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో నిన్న (అక్టోబర్‌ 2) జరిగిన సెమీఫైనల్స్‌ మ్యాచ్‌ల్లో నమీబియా టాంజానియాపై, జింబాబ్వే కెన్యాపై విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరాయి. రేపు జరుగబోయే ఫైనల్లో కెన్యా, నమీబియా ఆఫ్రికా క్వాలిఫయర్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం పోటీపడతాయి. 

 చదవండి: రషీద్‌ ఖాన్‌ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్‌కు తప్పని ఓటమి
 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)