Breaking News

సంచలనం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన జింబాబ్వే

Published on Sun, 11/24/2024 - 21:47

జింబాబ్వే ప‌ర్య‌ట‌నకు వెళ్లిన పాకిస్తాన్‌కు భారీ షాక్ త‌గిలింది. బులవాయో వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగుల(డీఎల్‌ఎస్‌) తేడాతో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. 

జింబాబ్వే బ్యాటర్లలో నగరవా(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజా(39) పరుగులతో రాణించారు. మరోవైపు పాక్ బౌలర్లలో ఆఘా సల్మాన్‌, ఫైజల్ ఆక్రమ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు.

 ఆతిథ్య జట్టు బౌలర్లు దాటికి పాక్ జట్టు 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో జింబాబ్వేను విజేతగా అంపైర్‌లు నిర్ణయించారు.

జింబాబ్వే బౌలర్లలో ముజాబ్ రానీ, సికిందర్ రజా, సీన్ విలియమ్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సికిందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా వన్డేల్లో పాకిస్తాన్‌ను జింబాబ్వే ఓడించడం ఇదే ఆరోసారి కావడం గమనార్హం. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే నవంబర్ 26న ఇదే వేదికలో జరగనుంది.
చదవండి: IPL 2025: వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు

 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)