Breaking News

విండీస్‌ బౌలర్‌ ధాటికి విలవిలలాడిన జింబాబ్వే

Published on Sun, 02/12/2023 - 21:29

Gudakesh Motie: వెస్టిండీస్‌ యువ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ ధాటికి జింబాబ్వే విలవిలలాడింది. 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) మొదలైన రెండో టెస్ట్‌లో మోటీ 7 వికెట్లతో విజృంభించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది.

మోటీతో పాటు జేసన్‌ హోల్డర్‌ (2/18), అల్జరీ జోసఫ్‌ (1/29) రాణించడంతో జింబాబ్వే స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఇన్నోసెంట్‌ కాలా (38) టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కాలాతో పాటు చిబాబ (10), కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ (22), ట్రిపానో (23 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రేమన్‌ రీఫర్‌ (53) అర్ధసెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (36), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (22) ఓ మోస్తరుగా రాణించారు. కైల్‌ మేయర్స్‌ (8), రోస్టన్‌ చేజ్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో బ్రెండన్‌ మవుటా 2 వికెట్లు పడగొట్టగా.. మసకద్జకు ఓ వికెట్‌ దక్కంది. రీఫర్‌ రనౌటయ్యాడు.

కాగా, తొలి టెస్ట్‌ సెంచరీ హీరో, జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడం విశేషం.  2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో బ్యాలెన్స్‌తో పాటు విండీస్‌ కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ సెంచరీలు చేయగా.. శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ కొడుకు తేజ్‌నరైన్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)