Breaking News

అరుదైన మైలురాయిని తాకిన డెవాన్‌ కాన్వే

Published on Fri, 08/08/2025 - 12:15

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ వెటరన్‌ బ్యాటర్‌ టెస్ట్‌ల్లో 2000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 72 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 2000 పరుగుల మార్కును తాకాడు. 79 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

ఇటీవలికాలంలో పేలవ ఫామ్‌లో ఉండిన కాన్వే.. ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌తోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 88 పరుగులు చేశాడు. 2021లో ఇంగ్లండ్‌పై టెస్ట్‌ అరంగేట్రం చేసిన కాన్వే.. తన తొలి మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీ బాదాడు. టెస్ట్‌ కెరీర్‌లో 29 మ్యాచ్‌లు ఆడిన కాన్వే 4 సెంచరీలు, 31 హాఫ్‌ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. జింబాబ్వేను 125 పరుగులకు కుప్పకూల్చిన ఆ జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 174 పరుగులు చేసింది. కాన్వేతో (79) పాటు జేకబ్‌ డఫీ (8) క్రీజ్‌లో ఉన్నారు. విల్‌ యంగ్‌ 74 పరుగులు చేసి ఔటయ్యాడు.

అంతకుముందు మ్యాట్‌ హెన్రీ (15-3-40-5), జకరీ ఫోల్క్స్‌ (16-5-38-4) విజృంభించడంతో జింబాబ్వే 125 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మూడున్నరేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బ్రెండన్‌ టేలర్‌ (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్‌ కీపర్‌ విన్సెంట్‌ మసేకెసా 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ తొలి టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌ కొసం న్యూజిలాండ్‌ జింబాబ్వేలో పర్యటిస్తుంది.

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)