Breaking News

శివాలెత్తిన గుర్బాజ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌

Published on Sun, 11/02/2025 - 18:52

జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో (Zimbabwe vs Afghanistan) భాగంగా ఇవాళ (నవంబర్‌ 2) జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan) భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. 

ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్‌ (92), ఇబ్రహీం జద్రాన్‌ (60) ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా గుర్భాజ్‌ (Rahmanullah Gurbaz) శివాలెత్తిపోయారు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. 

ఆఖర్లో సెదిఖుల్లా అటల్‌ (15 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. వేగంగా పరుగులు చేసే క్రమంలో షాహిదుల్లా కమల్‌ (10) ఔటయ్యాడు. నబీ ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఈవాన్స్‌ 2 వికెట్లు తీయగా.. రిచర్డ్‌ నగరవ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్‌ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్‌ జింబాబ్వేలో పర్యటిస్తుంది. 

 చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధన

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)