Breaking News

'రోహిత్‌ శర్మ అద్భుతమైన కెప్టెన్‌.. ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తాడు'

Published on Tue, 01/23/2024 - 13:08

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్‌ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్లు ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో చెమటోడ్చుతున్నాయి.

అయితే టెస్టు సిరీస్‌కు ఆరంభానికి ముందే ఇరు జట్లు ఊహించని షాక్‌లు తగిలాయి. ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్‌ టెస్టు సిరీస్‌ నుంచి వైదొలగగా.. భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.

ఇక తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై భారత మాజీ పేసర్‌ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రోహిత్‌ శర్మ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్‌గా కూడా రాణిస్తాడని జహీర్‌ థీమా వ్యక్తం చేశాడు.

"రోహిత్‌ శర్మ అద్భుతమైన నాయకుడు. జట్టులోని ప్రతీ ఆటగాడికి మద్దతుగా ఉంటాడు. రోహిత్‌ తన కెప్టెన్సీతో మొత్తం జట్టును ప్రభావితం చేస్తాడు. అదే అతడి కెప్టెన్సీలో స్పెషల్‌ క్వాలిటీ. అతడు ఇప్పటికే తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో అతడు జట్టును నడిపించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

ఇప్పుడు ఇంగ్లండ్‌ సిరీస్‌లో కూడా అదే పంథాలో జట్టును నడిపిస్తాడు. రోహిత్‌ ఈ సిరీస్‌లో కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాట్‌తో కూడా రాణిస్తాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌పై ఎన్నో అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి ప్రస్తుత సిరీస్‌లో కూడా రోహిత్‌ తన మార్క్‌ చూపిస్తాడని ఆశిస్తున్నానని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్‌ పేర్కొన్నాడు.
చదవండి: Jasprit Bumrah: 'బజ్‌బాల్‌తో నాకు సంబంధం లేదు.. ఏమి చేయాలో నాకు తెలుసు'

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)