టీమిండియాలో నో ఛాన్స్‌.. చాహల్ కీలక నిర్ణయం

Published on Fri, 03/14/2025 - 11:58

టీమిండియా లెగ్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ (Yuzvendra Chahal) మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్దమ‌య్యాడు. చాహల్ 2025 సీజన్‌లో నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్ల‌బ్‌ త‌ర‌పున ఆడ‌నున్నాడు. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత చాహ‌ల్ ఇంగ్లండ్‌కు ప‌య‌నం కానున్నాడు. ఈ ఏడాది జూన్‌లో చాహ‌ల్ నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ జ‌ట్టులో చేరి సీజ‌న్ ఆఖ‌రి వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాడు.

రెడ్‌బాల్ క్రికెట్‌తో పాటు రాయ‌ల్ లండ‌న్ వ‌న్డే క‌ప్‌న‌కు కూడా చాహ‌ల్ అందుబాటులో ఉండ‌నున్నాడు. చాహ‌ల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడ‌నుండ‌డం ఇది రెండోసారి. అంత‌కుముందు 2023లో నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్లబ్‌కే చాహ‌ల్ ప్రాతినిథ్యం వ‌హించాడు. కేవ‌లం నాలుగు మ్యాచ్‌ల్లో 21.10 సగటుతో 19 వికెట్లు ప‌డ‌గొట్టి.. నార్తాంప్టన్‌షైర్‌ను డివిజన్ టూలో నాల్గవ స్థానానికి చేర్చాడు. ఇక మరోసారి నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్ల‌బ్ ఒప్పందం కుదుర్చుకోవడంపై చాహల్ స్పందించాడు.

"గత సీజన్‌లో కౌంటీల్లో ఆడిన సమయాన్ని నేను ఆస్వాదించాను. మరోసారి నార్తాంప్టన్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా సంతోషం ఉంది.  నార్తాంప్టన్‌షైర్‌ డ్రెస్సింగ్ రూమ్‌లో లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు. వారితో కలిసి మరోసారి డ్రెసింగ్ రూమ్‌ను పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గత సీజన్‌లో చివరివరకు మేము అద్భుతమైన క్రికెట్ ఆడాము. ఈ సీజన్‌లో భారీ విజయాలను సాధిస్తామని ఆశిస్తున్నాము" అని చాహల్ పేర్కొన్నాడు. చాహల్ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. చాహల్ చివరగా 2023లో భారత్ తరపున ఆడాడు. 

అయితే  2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో అతడ సభ్యునిగా ఉన్నాడు.  కానీ ఈ టోర్నీ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్‌-2025 సీజన్ కోసం ఈ లెగ్గీ సన్నద్దమవుతున్నాడు. మెగా వేలంలో అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.
చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)