Breaking News

100th Test: కెప్టెన్‌ అయితే బాగుండేది!.. అశ్విన్‌ భావోద్వేగం

Published on Tue, 03/05/2024 - 16:27

టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. ధర్మశాలలో ‘సెంచరీ’ పూర్తి చేసుకోనున్నాడు.

ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదో టెస్టు సందర్భంగా అశూ ఈ ఫీట్‌ అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేతో మాట్లాడుతూ అశ్విన్‌ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.

కెప్టెన్‌ అయితే బాగుండేది.. అశ్విన్‌ భావోద్వేగం
‘‘నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు. ఎన్నో సవాళ్లు. ప్రతికూల సమయంలో.. ‘నాకే ఎందుకిలా జరుగుతోంది?’ అని బాధపడేవాడిని. అయితే, క్లిష్ట పరిస్థితులు, ఒత్తిళ్లను దాటినందు వల్లే ఈరోజు నాకంటూ ఈ గుర్తింపు వచ్చిందని, ఈ స్థాయికి చేరుకోగలిగానని అనిపిస్తోంది.

చాలా మంది నా దగ్గరకు వచ్చి.. ‘నీకు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది’ అని అంటూ ఉంటారు. కానీ.. అది ఎప్పటికీ జరుగదనే విషయం నాకు తెలుసు. అందుకే మనసులో ఎలాంటి సంశయాలు పెట్టుకోకుండా హాయిగా ఉంటాను’’ అని అశూ భావోద్వేగానికి లోనయ్యాడు.

వాళ్లకు విఫలం కావడానికి మరిన్ని ఛాన్సులు
ఇదిలా ఉంటే.. విదేశీ గడ్డపై ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో అశ్విన్‌ను కాదని.. మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకే బీసీసీఐ ప్రాధాన్యం ఇస్తోందన్న విషయం తెలిసిందే. ఈ అంశం గురించి ప్రస్తావనకు రాగా అశ్విన్‌ హుందాగా సమాధానమిచ్చాడు.

‘‘బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లను ద్వితీయ శ్రేణి కిందే పరిగణిస్తారు. నేను ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే వెంటనే పక్కనపెట్టేస్తారు. అదే వేరే వాళ్లకు విఫలం కావడానికి మరిన్ని ఛాన్సులు ఇస్తారు.

నాకు ఆ స్వార్థం లేదు
అయినా, నేను మనశ్శాంతిగానే ఉండగలుగుతాను. ఎందుకంటే.. కొన్ని కఠిన వాస్తవాలను అంగీకరించకతప్పదని నాకు తెలుసు. ఐదు రోజుల ఆట ముగిసిన తర్వాత జట్టు గెలిచిందా లేదా అన్న విషయానికి ప్రాధాన్యం ఇస్తాను. టీమిండియా గెలిస్తే నాకంతకంటే సంతోషం మరొకటి ఉండదు.

అంతేగానీ స్వప్రయోజనాల కోసం జట్టు ప్రయోజనాలను తాకట్టుపెట్టాలనే స్వార్థం నాకు లేదు’’ అని అశ్విన్‌ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఈ మేరకు జియో సినిమా షోలో అశూ వ్యాఖ్యలు చేశాడు.

500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఘనుడు
కాగా ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌ మూడో టెస్టు సందర్భంగా అశ్విన్‌ 500 వికెట్ల క్లబ్‌(టెస్టు)లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో అశూతో పాటు ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌స్టో కూడా తన వందో టెస్టు ఆడబోతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చి.. అశ్విన్‌ సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా వందో టెస్టు సెలబ్రేట్‌ చేస్తారని అభిమానులు భావించారు. అయితే, రోహిత్‌ ఇప్పటికే జట్టుతో చేరడంతో అశూకు ఆ ఛాన్స్‌ లేనట్లే కనిపిస్తోంది.

చదవండి: Anant- Radhika: రోహిత్‌ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)