Breaking News

పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే..

Published on Sat, 09/09/2023 - 11:20

Asia Cup 2023- Pakistan vs India: పాకిస్తాన్‌ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. నంబర్‌ 8లోనూ బ్యాటింగ్‌ ఆప్షన్‌ ఉండాలని కోరుకుంటే మాత్రం దాయాదిపై గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్‌-2023లో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్‌ చేయలేకపోయింది.

పాక్‌ పేసర్ల ధాటికి
పాక్‌ పేసర్లు షాహిన్‌ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌ విజృంభణతో 266 పరుగులకు ఆలౌట్‌ అయింది. అయితే, భారత ఇన్నింగ్స్‌ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో పాక్‌ బ్యాటింగ్‌ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్‌ రద్దు కాగా ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది.

ఈ నేపథ్యంలో నేపాల్‌పై గెలుపొందిన టీమిండియా, పాకిస్తాన్‌ సూపర్‌-4లో ఆదివారం మరోసారి పోటీపడనున్నాయి. కాగా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడంటూ పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ తుదిజట్టులోకి తీసుకుంది మేనేజ్‌మెంట్‌.

షమీని కాదని శార్దూల్‌ను తీసుకుంటే
ఇందులో భాగంగా పాక్‌తో మ్యాచ్‌లో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీపై వేటు వేసింది. అయితే, అతడిని కాదని శార్దూల్‌ తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 3 పరుగులకే అతడు అవుటయ్యాడు. 


షమీ- శార్దూల్‌ (PC: BCCI)

ఇక నేపాల్‌తో మ్యాచ్‌కు జస్‌ప్రీత్‌ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి చోటు దక్కగా.. అతడు 7 ఓవర్ల బౌలింగ్‌లో 4.10 ఎకానమీతో ఒక వికెట్‌ తీశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో తదుపరి మ్యాచ్‌లో షమీని ఆడిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదని పేర్కొన్నాడు.

పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు వేయాల్సిందే
‘‘బౌలింగ్‌ విభాగంలో కచ్చితంగా మార్పులు చేయాలి. శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో మహ్మద్‌ షమీని ఆడించాలి. గత మ్యాచ్‌ సాగిన తీరు బట్టే నేను ఈ మాట చెబుతున్నా. జట్టులో కనీసం ముగ్గురు నాణ్యమైన పేసర్లు ఉండాలి.

అలా కాకుండా.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మళ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నంబర్‌ 8 వరకు ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటే మాత్రం కష్టం. పాక్‌ను ఓడించాలంటే కచ్తిచంగా మంచి ఫాస్ట్‌బౌలర్లు జట్టులో ఉండాలి’’ అని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుదిజట్టులో కచ్చితంగా బుమ్రా, సిరాజ్‌లతో పాటు షమీ కూడా ఉండాలని పేర్కొన్నాడు.

రిజర్వ్‌ డే
కాగా శ్రీలంకలోని కొలంబోలో భారత్‌- పాక్‌ తమ తదుపరి మ్యాచ్‌ ఆడనున్నాయి. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరుకు వర్షం అడ్డంకి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వ్‌ డేను కేటాయించింది ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌. 

చదవండి: Ind Vs Pak: మాకు కూడా కావాలన్న కోచ్‌లు! మా అంగీకారంతోనేనన్న బోర్డులు.. ఇదేం ట్విస్టు? 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)