'అలా జరగనందుకు చాలా బాధగా ఉంది.. అతడు ఇండియన్‌ క్రికెట్‌ను ఏలుతాడు'

Published on Mon, 07/17/2023 - 08:15

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జైశ్వాల్‌.. తన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 382 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 171 పరుగులు చేశాడు.

ఇక డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన జైశ్వాల్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.  జైస్వాల్ అద్భుతమైన ఆటగాడని, చాలా కాలం పాటు భారత్ తరఫున ఆడతాడని హర్భజన్ కొనియాడాడు.

"యశస్వి జైస్వాల్‌ తొలి మ్యాచ్‌లోనే తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. అతడు డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయినందుకు చాలా బాధ అనిపించింది. కానీ జైశ్వాల్‌ ఇండియన్‌ క్రికెట్‌ను చాలా కాలం పాటు కచ్చితంగా ఏలుతాడు. జైశ్వాల్‌కు టాలెంట్‌లో కొదవలేదు. అతడికి నేను ఇచ్చే సలహా ఒక్కటే.

జైశ్వాల్‌ ప్రపంచక్రికెట్‌ను శాసించాలంటే మరింత కష్టపడి పనిచేయాలి. అదే విధంగా ఫిట్‌నెస్‌ను కూడా కాపాడుకుంటూ రావాలి. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా రోజుల తర్వాత అతడి బ్యాట్‌ నుంచి వచ్చిన సెంచరీ. కోహ్లి కూడా సెంచరీ మార్క్‌ను అందుకుని ఉంటే బాగుండేది" అని హర్భజన్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: AFG vs BAN: ఆఖరి టీ20లో ఆఫ్గానిస్తాన్‌ చిత్తు.. బంగ్లాదేశ్‌దే సిరీస్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)