Breaking News

యూ టర్న్‌ తీసుకున్న యశస్వి జైస్వాల్‌

Published on Fri, 05/09/2025 - 13:40

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మనసు మార్చుకున్నాడు. దేశవాలీ క్రికెట్‌లో గోవాకు ఆడాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జైస్వాల్‌ కొద్ది రోజుల కిందట ముంబై నుంచి గోవాకు వలస వెళ్లాలని (దేశవాలీ క్రికెట్‌) నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా అతను ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌పై (MCA) ఒత్తిడి తెచ్చి మరీ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) పొందాడు. 

తాజాగా ఈ విషయంలో జైస్వాల్‌ యూ టర్న్‌ తీసుకున్నాడు. తిరిగి తాను ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఎంసీఏకు ఈ-మెయిల్‌ ద్వారా సందేశాన్ని పంపాడు. వారు జారీ చేసిన ఎన్‌వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వలస వెళ్లాలనుకున్న తన ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు. 

ఈ దేశవాలీ సీజన్‌లో సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఎంసీఏ తిరిగి తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్‌వోసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్‌ అసోసియేషన్‌కు కాని సమర్పించలేదని తెలిపాడు.

కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టిన జైస్వాల్‌.. ముంబై తరఫున దేశవాలీ క్రికెట్‌ ఆడి టీమిండియాలో, ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాల చేత తనకు జీవితాన్ని ఇచ్చిన ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌నే వదిలి వెళ్లాలనుకున్న జైస్వాల్‌ ఎందుకో తిరిగి మనసు మార్చుకున్నాడు. వాస్తవానికి గోవా క్రికెట్‌ అసోసియేషన్‌ జైస్వాల్‌కు కెప్టెన్సీ ఆశ చూపి తమవైపు మళ్లేలా చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, అతను తిరిగి పాత జట్టు ముంబైకే ఆడాలనుకుం​టున్నాడు.

జైస్వాల్‌కు ముంబై తరఫున ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఆ జట్టు తరఫున ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. 2018-19 రంజీ సీజన్‌లో తొలిసారి ముంబైకు ప్రాతినిథ్యం​ వహించిన జైస్వాల్‌.. అతి తక్కువ వ్యవధిలో చాలా పాపులర్‌ అయ్యాడు. ముంబై తరఫున ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 60కి పైగా సగటుతో 13 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 3712 పరుగులు చేశాడు. ఇందులో డబుల్‌ సెంచరీలు కూడా ఉన్నాయి.

2019-20 సీజన్‌లో ముంబై తరఫున లిస్ట్‌-ఏ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జైస్వాల్‌.. విజయ్‌ హజారే ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే జైస్వాల్‌కు ఐపీఎల్‌ ఛాన్స్‌ దక్కింది. 2020 సీజన్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జైస్వాల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోని జైస్వాల్‌ ఫార్మాట్లకతీతంగా దేశవాలీ క్రికెట్‌లో, అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో చెలరేగిపోతున్నాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)