Breaking News

యశస్వి, శివమ్‌ దూబేలకు బంపర్‌ ఆఫర్‌..!

Published on Tue, 01/16/2024 - 11:18

టీమిండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబేలకు బంపర్‌ ఆఫర్‌ తగిలేలా ఉంది. ఈ ఇద్దరికి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతకొంతకాలంగా పొట్టి క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న వీరిరువురికి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌తో గుర్తింపునివ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.

త్వరలోనే వీరు శుభవార్త వినే అవకాశం ఉందని భారత క్రికెట్‌ సర్కిల్స్‌ కోడైకూస్తున్నాయి. బీసీసీఐ గతేడాది (2022-23) మొత్తం 26 మంది ఆటగాళ్లకు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ అందించింది. 2023-24 బీసీసీఐ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాలో కొత్తగా యశస్వి, దూబే చేరవచ్చు.

కాగా, ప్రస్తుతం స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో యశస్వి, దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా శివమ్‌ దూబే తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘన్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో అతను రెండు అజేయ అర్ధశతకాలతో (60, 63) పాటు మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

గతేడాది ఐర్లాండ్‌ టూర్‌తో మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి (టీ20 జట్టు) రీఎంట్రీ ఇచ్చిన దూబే అప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్నాడు (20 టీ20ల్లో 45.83 సగటున 275 పరుగులు, 8 వికెట్లు).

అంతకముందు ఐపీఎల్‌ 2023లో దూబే సీఎస్‌కే తరఫున విశ్వరూపమే ప్రదర్శించాడు. ఆ సీజన్‌లో అతను 16 మ్యాచ్‌ల్లో 158.33 స్ట్రయిక్‌రేట్‌తో 418 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు, 35 సిక్సర్లు ఉన్నాయి. దూబే బౌలింగ్‌లో ఇంకాస్త మెరుగై, బ్యాటింగ్‌ ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తే హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు జైస్వాల్‌ అరంగేట్రం నాటి నుంచి టెస్ట్‌, టీ20ల్లో చెలరేగిపోతున్నాడు. గతేడాది వెస్టిండీస్‌ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్‌.. నాటి నుంచి 4 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడి 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు చేశాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో జైస్వాల్‌ (68).. దూబేతో కలిసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు. 
 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)