Breaking News

దూసుకొస్తున్న జైస్వాల్‌.. కెరీర్‌ బెస్ట్‌ సాధించిన జురెల్‌

Published on Wed, 02/28/2024 - 14:58

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శనలు చేసిన యశస్వి జైస్వాల్‌ (73, 37), శుభ్‌మన్‌ గిల్‌ (38, 52 నాటౌట్‌), దృవ్‌ జురెల్‌ (90, 39 నాటౌట్‌) ర్యాంకింగ్స్‌ భారీ జంప్‌ కొట్టి కెరీర్‌ అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. 

యశస్వి మూడు స్థానాలను మెరుగుపర్చుకుని టాప్‌ 10 దిశగా (12వ స్థానం) దూసుకువస్తుండగా.. గిల్‌ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జురెల్‌ 31 స్థానాలు మెరుగుపర్చుకుని 69 స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కదంతొక్కిన  ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

భారత్‌ నుంచి టాప్‌-10లో విరాట్‌ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్‌ ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌కు దూరంగా ఉండటంతో అతని ర్యాంక్‌ ఏడు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగో టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు. 

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్‌, జడేజా ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా.. రబాడ, కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మరో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ రాంచీ టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలు మెరుగపర్చుకుని కెరీర్‌ అత్యుత్తమ 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌తో నాలుగో టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 80వ ర్యాంక్‌కు ఎగబాకాడు. 

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ పెద్దగా మార్పులేమీ జరగలేదు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా..  ఇంగ్లండ్‌ జో రూట్‌ మాత్రం మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ప్లేస్‌కే చేరాడు.  


 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)