Breaking News

వారెవ్వా జైశ్వాల్‌.. విధ్వంసకర డబుల్‌ సెంచరీ! ఇదేమి బాదుడు

Published on Sun, 02/18/2024 - 14:38

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ దుమ్ములేపుతున్నాడు. రెండో టెస్టులో డబుల్‌ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్‌.. ఇప్పుడు మరో ద్విశతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో విధ్వంసకర డబుల్‌ సెంచరీతో యశస్వీ చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లను జైశ్వాల్‌ ఊచకోత కోశాడు. సెంచరీ తర్వాత మూడో రోజు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి జైస్వాల్.. నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చి వీర విహారం చేశాడు.

ఈ క్రమంలో జైశ్వాల్‌ కేవలం 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో తన డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  ఓవరాల్‌గా 238 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌.. 14 ఫోర్లు, 12 సిక్సులతో అజేయంగా 214 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కాగా జైశ్వాల్‌కు తన కెరీర్‌లో ఇది రెండో డబుల్‌ డబుల్‌ సెంచరీ కావడం గమనార్హం.

అంతకుముందు వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వీ  209 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. జైశ్వాల్‌తో పాటు శుబ్‌మన్‌ గిల్‌(91), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌(68*) అద్భుతంగా రాణించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌ను భారత జట్టు 430/4 పరుగుల భారీ స్కోర్ వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు టీమిండియా 557 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)