Breaking News

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్‌ సూపర్‌ సెంచరీ

Published on Fri, 06/20/2025 - 20:02

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌ను టీమిండియా స్టార్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ ఘ‌నంగా ఆరంభించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదిక‌గా ప్రారంభ‌మైన‌ తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో 144 బంతుల్లో త‌న సెంచ‌రీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు.

కేఎల్ రాహుల్‌తో క‌లిసి మొద‌టి వికెట్‌కు 91 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన య‌శ‌స్వి.. ఆ తర్వాత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 131 పరుగుల పార్టనర్‌షిప్‌ నమోదు చేశాడు . జైశ్వాల్‌కు ఇది ఐదో టెస్టు సెంచ‌రీ. త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకోగానే గాల్లోకి జంప్ చేస్తూ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు.
ఐదో ఆట‌గాడిగా.
కాగా జైశ్వాల్ త‌న కెరీర్‌లో ఇంగ్లండ్‌పై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే సెంచ‌రీ సాధించ‌డం విశేషం.  త‌ద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భార‌త ఆట‌గాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్ర‌స్ధానంలో భార‌త మాజీ ప్లేయ‌ర్‌ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్‌లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేశాడు.

ఇంగ్లండ్‌లో త‌మ తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీలు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే
133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952
131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996
129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982
146 ముర‌ళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014
100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025

టీబ్రేక్‌కు భార‌త స్కోరంతంటే?
ఇక తొలి రోజు టీ బ్రేక్ స‌మ‌యానికి టీమిండియా త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల న‌ష్టానికి 215 ప‌రుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(100), గిల్‌(58) ఉన్నారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు బ్రైడ‌న్ కార్స్‌, బెన్ స్టోక్స్ త‌లా వికెట్ సాధించారు.
చదవండి: ద‌క్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్‌.. ఎవరంటే?


 

 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)