Breaking News

Yashasvi Jaiswal: ప్రతిభకు దక్కిన గౌరవం

Published on Wed, 02/28/2024 - 20:53

2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. 30 మంది పేర్లు గల ఈ జాబితాలో అందరూ ఊహించిన విధంగానే శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను వీరిపై వేటు పడినట్లు తెలుస్తుంది. వీరితో పాటు చతేశ్వర్‌ పుజారా, ఉమేశ్‌ యాదవ్, శిఖర్‌ ధవన్‌ లాంటి వెటరన్లను బీసీసీఐ పక్కకు పెట్టింది. సరైన అవకాశాలు రాని చహల్‌, దీపక్‌ హుడాలపై కూడా వేటు పడింది.

  • ఏ ప్లస్‌ కేటగిరిలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా..
  • ఏ కేటగిరిలో అశ్విన్‌, షమీ, సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా..
  • బి కేటగిరిలో సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, యశస్వి జైస్వాల్‌..
  • సి కేటగిరిలో రింకూ సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌, శార్దూల్ ఠాకూర్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్, ముఖేష్ కుమార్‌, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌, కేఎస్‌ భరత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, రజత్‌ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. 

కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్‌ లభించగా.. అక్షర్‌ పటేల్‌, రిషబ్‌ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్‌ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ద్‌ కృష్ణ , అవేశ్‌ ఖాన్‌ , రజత్‌ పాటిదార్ , జితేశ్‌ శర్మ , ముకేశ్‌ కుమార్‌, రవి బిష్ణోయ్‌లకు కొత్తగా కాంట్రాక్ట్‌ లభించింది.

ప్రతిభకు దక్కిన గౌరవం..
సహజంగా తొలిసారి కాంట్రాక్ట్‌ లభించే ఆటగాళ్లకు బీసీసీఐ తొలుత సి గ్రేడ్‌లో అవకాశం ఇస్తుంది. అయితే సూపర్‌ ఫామ్‌లో ఉన్న యశస్వి నేరుగా బి గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ పొంది జాక్‌పాట్‌ కొట్టాడు. ఈ కాంట్రాక్ట్‌ అనేది అతనికి ఆషామాషీగా లభించింది కాదు. ఈ యువ కెరటం ఆడిన 8 టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 971 పరుగులు చేశాడు. ఇందులో ఇటీవల ఇంగ్లండ్‌పై చేసిన వరుస డబుల్‌ సెంచరీలు ఉన్నాయి.

ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో అతను రికార్డు స్థాయిలో 4 మ్యాచ్‌ల్లో 655 పరుగులు చేసి కోహ్లి పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేశాడు. యశస్వి మెరుపులు టెస్ట్‌ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ యువ ఆటగాడు టీ20ల్లో సైతం సత్తా చాటాడు. ఇప్పటివరకు ఆడిన 17 మ్యాచ్‌ల్లో సెంచరీ, 4 అర్దసెంచరీల సాయంతో 161 స్ట్రయిక్‌రేట్‌తో 502 పరుగులు చేశాడు. ఈ స్థాయిలో రాణించిన కారణంగానే  అతనికి నేరుగా బి గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ దక్కింది.

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)