Breaking News

టీమిండియా ఓపెనర్‌కు అస్వస్థత..

Published on Wed, 12/17/2025 - 10:34

టీమిండియా యువ ఓపెనర్, ముంబై స్టార్ క్రికెటర్‌ యశస్వి జైశ్వాల్ అనారోగ్యం బారిన పడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో మంగళవారం రాజస్తాన్‌తో జరిగిన సూపర్ లీగ్ మ్యాచ్ అనంతరం జైశ్వాల్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. 

దీంతో అతడిని వెంటనే పుణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యులు అతడికి స్కాన్లు నిర్వహించి  'అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్స్‌ (పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) ఉన్నట్లు తేల్చారు.అయితే  జైశ్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అతడికి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

అనారోగ్యంతోనే బ్యాటింగ్
కాగా రాజస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జైశ్వాల్ అస్వస్థతతో ఉన్నప్పటికీ ముంబై తరపున మైదానంలోకి దిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో అతడు చాలా అసౌక్యరంగా కన్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైశ్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. 

జైశ్వాల్ త్వరగా ఔటైనప్పటికి.. ముంబై 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అజింక్య రహానె (72*), సర్ఫరాజ్ ఖాన్ (73) అద్భుత  హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై గెలిపించినప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ టోర్నీలో జైశ్వాల్ కూడా దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ జైశ్వాల్ శతక్కొట్టాడు.
చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్‌!

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)