Breaking News

మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్‌లోనే భారత్‌

Published on Sun, 09/29/2024 - 16:18

న్యూజిలాండ్‌పై రెండో టెస్ట్‌లో విజయానంతరం శ్రీలంక జట్టు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌ (2023-25)లో శ్రీలంక తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేసి నాలుగింట ఓడింది. న్యూజిలాండ్‌పై తాజా విక్టరీతో శ్రీలంక పాయింట్ల పర్సంటేజీ 55.56 శాతంగా ఉంది. 

మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ మూడో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్‌ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఎనిమది మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, ఐదింట పరాజయాలు ఎదుర్కొంది. ఆ జట్టు పాయింట్ల పర్సంటేజీ 37.50 శాతంగా ఉంది.

టాప్‌లోనే భారత్‌
స్వదేశంలో బంగ్లాదేశ్‌ను తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడించిన భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్‌ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సొంతం చేసుకుని, 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఓ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. భారత్‌ పాయింట్ల పర్సంటేజీ 71.67 శాతంగా ఉంది. 

బంగ్లాదేశ్‌ విషయానికొస్తే.. భారత్‌ చేతిలో తొలి టెస్ట్‌లో ఓటమి అనంతరం ఈ జట్టు ఐదో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్‌ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, నాలుగింట ఓడింది.

భారత్‌ వెనకాలే ఆస్ట్రేలియా
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా భారత్‌ వెనకాలే ఉంది. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచి మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఓ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

ఇంగ్లండ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సైకిల్‌లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి, ఏడింట ఓడింది. ఓ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

మిగతా జట్ల విషయానికొస్తే..
తాజా స్టాండింగ్స్‌లో సౌతాఫ్రికా ఆరో స్థానంలో.. పాకిస్తాన్‌ ఎనిమిదో స్థానంలో.. వెస్టిండీస్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు (3 పరాజయాలు, ఓ డ్రా), పాకిస్తాన్‌ ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు (5 పరాజయాలు), వెస్టిండీస్‌ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క విజయం (6 పరాజయాలు, 2 డ్రాలు) సాధించాయి.

చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక..

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)