Breaking News

WTC Final: అంచనా తప్పింది.. అశ్విన్‌ను పక్కకు పెట్టి మూల్యం చెల్లించుకుంది..! 

Published on Thu, 06/08/2023 - 10:01

WTC FINAL IND VS AUS: టీమిండియా మేనేజ్‌మెంట్‌ అగ్రశ్రేణి స్పిన్నర్‌ అశ్విన్‌ను తుది జట్టులో నుంచి తప్పించి తగిన మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన అశ్విన్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని గైర్హాజరీలో ఆసీస్‌ బ్యాటర్లు పేట్రేగిపోయారు. ముఖ్యంగా ట్రవిస్‌ హెడ్‌ (146 నాటౌట్‌), స్టీవ్‌ స్మిత్‌ (95 నాటౌట్‌) టీమిండియా బౌలర్లను ఆటాడుకున్నారు. ఫలితంగా తొలి రోజే ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. ఇదే పరిస్థితి రెండో రోజు కూడా కొనసాగితే టీమిండియా విజయావకాశాలకు గండిపడవచ్చు.

కాగా, అశ్విన్‌కు తుది జట్టులో స్థానంపై మ్యాచ్‌ ముందు రోజు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సందేహం వ్యక్తం చేయగా, చివరకు అదే జరిగింది. ‘పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని’ అశ్విన్‌ను ఆడించడం లేదని, బాధగా ఉన్నా తప్పట్లేదని రోహిత్‌ అన్నాడు. అయితే తొలిరోజు భారత బౌలర్ల ప్రదర్శనను చూసిన తర్వాత  అశ్విన్‌ లేని లోటు కనిపించింది.

ఆరంభంలో కొద్దిసేపు మాత్రమే పిచ్‌పై తేమ ఉండి ఆ తర్వాత అంతా సాధారణంగా మారిపోయింది. పరిస్థితుల విషయంలో భారత్‌ అంచనా తప్పిందని మాజీ క్రికెటర్లు పాంటింగ్, హాడిన్, మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాపై అశ్విన్‌కు అద్భుత రికార్డు ఉండటంతోపాటు ఆ జట్టు టాప్‌–7లో నలుగురు ఎడంచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. పిచ్‌ ఎలా ఉన్నా అతను కచ్చితంగా ప్రభావం చూపేవాడని వారు విశ్లేషించారు.

మ్యాచ్‌కు ముందు సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం మరోలా ఆలోచించి నలుగురు పేసర్లకు అవకాశం కల్పించింది. మరోవైపు జడేజా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత్‌ ఇద్దరు స్పిన్నర్లతో ఆడగా, కివీస్‌ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. పరిస్థితులన్నీ పేస్‌ బౌలింగ్‌కు అనుకూలించాయి. అప్పుడు ‘పొరపాటు’ చేసినట్లుగా గుర్తించిన జట్టు ఈసారి దానిని సరిదిద్దుకోబోయే మరో పొరపాటు చేసినట్లుంది!   

చదవండి: తొలి రోజే ‘తల’పోటు...

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)