Breaking News

WTC Final: టీమిండియాకు కష్టమే.. 250 పరుగులే చాలా ఎక్కువ..!

Published on Sat, 06/10/2023 - 16:22

ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో టీమిండియా విజయావకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. నాలుగో రోజు  తొలి సెషన్‌ సమయాని​కి ఆసీస్‌ 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీమిండియా డ్రా కోసమే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రా లేక ఓటమే తప్ప.. రోహిత్‌ సేనకు గెలిచే అవకాశం దాదాపుగా లేనట్టే.

ఈ పరిస్థితుల్లో మరో విషయం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. ఓవల్‌లో ఇప్పటివరకు ఏ జట్టు 300కు పైగా టార్గెట్‌ను ఛేదించింది లేదు. ఇక్కడ విజయవంతంగా ఛేదించిన టార్గెట్‌ 263. 1902లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ అతికష్టం మీద 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆతర్వాత 1963లో 255, 1972లో 242, 1988లో 226 పరుగుల లక్ష్యాలను వివిధ జట్లు ఛేదించాయి. ఎటు చూసినా ఓవల్‌లో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం మాత్రం చాలా కష్టం. ఈ విషయమే ప్రస్తుతం టీమిండియాను  కలవరపెడుతుంది. 

ఇదిలా ఉంటే, 123/4 స్కోర్‌ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. ఆదిలోనే లబూషేన్‌ వికెట్‌ కోల్పోయింది. మూడో ఓవర్‌లోనే లబూషేన్‌ను ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపించాడు. వికెట్‌ కోల్పోయినా ఆసీస్‌ ఏమాత్రం తడబడకుండా నిలకడగా ఆడుతుంది. ఆ జట్టు స్కోర్‌ 160/5గా ఉంది. గ్రీన్‌ (21), క్యారీ (19) క్రీజ్‌లో ఉన్నారు. 

స్కోర్‌ వివరాలు..

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 469 ఆలౌట్‌ (హెడ్‌ 163, స్మిత్‌ 121, సిరాజ్‌ 4/108)
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 296 ఆలౌట్‌ (రహానే 89, ఠాకూర్‌ 51, కమిన్స్‌ 3/83)
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 160/5 (లబూషేన్‌ 41, జడేజా 2/32)

ఆసీస్‌ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది

చదవండి: WTC Final: అరుదైన క్లబ్‌లో మిచెల్‌ స్టార్క్‌.. నాలుగో బౌలర్‌గా..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)