Breaking News

రేపటి నుంచి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కొత్త సైకిల్‌ ప్రారంభం

Published on Mon, 06/16/2025 - 16:49

డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌ గత శనివారం​ జరిగిన ఫైనల్‌తో ముగిసింది. తుది పోరులో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఛాంపియన్‌గా అవతరించింది. తద్వారా డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్‌ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్‌ జట్లు అవతరించినట్లైంది.

అరంగేట్రం ఎడిషన్‌ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్‌ భారత్‌ను ఓడించి విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్‌ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్‌లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్‌ను చిత్తు చేసి టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్‌కు చేరిన భారత్‌ తాజాగా ముగిసిన సీజన్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

రేపటి నుంచి కొత్త సైకిల్‌ ప్రారంభం
వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కొత్త సైకిల్‌ (2025-27) రేపటి నుంచి (జూన్‌ 17) జరుగబోయే శ్రీలంక, బంగ్లాదేశ్‌ సిరీస్‌తో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో శ్రీలంక బంగ్లాదేశ్‌కు రెండు టెస్ట్‌లకు ఆతిథ్యమివ్వనుంది. తొలి టెస్ట్‌ జూన్‌ 17 నుంచి 21 వరకు గాలే వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్‌ జూన్‌ 25 నుంచి 29 వరకు కొలొంబోలో జరుగనుంది.

ఈ మధ్యలోనే భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కూడా ప్రారంభం​ కానుంది. జూన్‌ 20 నుంచి ఇరు జట్ల మధ్య హెడింగ్లేలో తొలి మ్యాచ్‌ జరుగనుంది.

ఈ సైకిల్‌లో మొత్తం 71 మ్యాచ్‌లు
2025-27 డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో మొత్తం 71 మ్యాచ్‌లు (9 జట్ల మధ్య) జరుగనున్నాయి. ఇందులో తాజా ఎడిషన్‌ రన్నరప్‌ ఆస్ట్రేలియా అత్యధికంగా 22 మ్యాచ్‌లు ఆడనుంది. ఆసీస్‌ తర్వాత ఇంగ్లండ్‌ (21) రెండో అత్యధిక మ్యాచ్‌లు ఆడుతుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సౌతాఫ్రికా రానున్న ఎడిషన్‌లో కేవలం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్‌ 18, న్యూజిలాండ్‌ 16, వెస్టిండీస్‌ 14, పాకిస్తాన్‌ 13, బంగ్లాదేశ్‌, శ్రీలంక తలో 12 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 

ఈ సైకిల్‌లో భారత్‌ ఆడబోయే మ్యాచ్‌లు..
స్వదేశంలో
వెస్టిండీస్‌తో (2)
సౌతాఫ్రికాతో (2)
ఆస్ట్రేలియాతో (5)

ప్రత్యర్ధి దేశంలో
ఇంగ్లండ్‌తో (5)
శ్రీలంకతో (2)
న్యూజిలాండ్‌తో (2)


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)