Breaking News

భారత్‌ ‘పంచ్‌’ పవర్‌

Published on Wed, 12/06/2023 - 00:52

యెరెవాన్‌ (అర్మేనియా): అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత బాక్సర్లు తమ పంచ్‌ పవర్‌ను చాటుకున్నారు. అర్మేనియాలో ముగిసిన ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌  లో మహిళల, పురుషుల విభాగాల్లో కలిసి భారత్‌ ఖాతాలో మొత్తం 17 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. చివరిరోజు భారత్‌కు మూడు పసిడి పతకాలు, ఆరు రజత పతకాలు లభించాయి.

మూడు స్వర్ణాలూ మహిళా బాక్సర్లే నెగ్గడం విశేషం. పాయల్‌ (48 కేజీలు), నిషా (52 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) బంగారు పతకాలు  సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో పాయల్‌ 5–0తో హెజినె పెట్రోసియాన్‌ (అర్మేనియా)పై, నిషా 5–0తో ఫరినోజ్‌ అబ్దుల్లాఇవా (తజికిస్తాన్‌)పై, ఆకాంక్ష 5–0తో తైమజోవా ఎలిజవెటా (రష్యా)పై విజయం సాధించారు.

ఇతర ఫైనల్స్‌లో వినీ (57 కేజీలు) 0–5తో మమతోవా సెవర (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... సృష్టి (63 కేజీలు) 0–5తో సియోఫ్రా లాలెస్‌ (ఐర్లాండ్‌) చేతిలో... అనా బుజులెవా (రష్యా) చేతిలో నాకౌట్‌ అయిన మేఘ (80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో సాహిల్‌ (75 కేజీలు), హేమంత్‌ సాంగ్వాన్‌ (ప్లస్‌ 80 కేజీలు), జతిన్‌ (54 కేజీలు) ఫైనల్లో పరాజయం చవిచూసి రజత పతకాలు గెల్చుకున్నారు. సాహిల్‌ 0–5తో అల్బెర్ట్‌ హరుతిన్యాన్‌ (అర్మేనియా) చేతిలో... హేమంత్‌ 0–5తో  సలిఖోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... జతిన్‌ 1–4తో తులెబెక్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)