Breaking News

CWC 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌

Published on Sun, 10/19/2025 - 20:12

భారత మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ (Deepthi Sharma) వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. 2000 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.

వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా ఇండోర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (India vs England) ఈ గ్రాండ్‌ డబుల్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి మొత్తం 4 వికెట్లు తీసి తన వన్డే వికెట్ల సంఖ్యను 153కి పెంచుకుంది. బ్యాటింగ్‌లో దీప్తి 2607 పరుగులు చేసింది.

దీప్తికి ముందు స్టెఫనీ టేలర్ (వెస్టిండీస్, 5873 పరుగులు, 155 వికెట్లు), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా , 4414, 166), మారిజన్‌ కాప్ (దక్షిణాఫ్రికా, 3397, 172) మాత్రమే వన్డేల్లో 2500 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లుగా ఉన్నారు.

దీప్తి ప్రభంజనం
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో దీప్తి ప్రభంజనం కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఆమె ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా కొనసాగుతోంది. టోర్నీ ఓపెనర్‌లో శ్రీలంకపై హాఫ్‌ సెంచరీ సహా 3 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. దీప్తి శర్మ (10-0-51-4) బంతితో రాణించినప్పటికీ ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ చేసింది. హీథర్‌ నైట్‌ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్‌) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్‌ యామీ జోన్స్‌ (56) రాణించింది. కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (38) పర్వాలేదనిపించింది.

మరో ఓపెనర్‌ ట్యామీ బేమౌంట్‌ 22, సోఫీ డంక్లీ 11, అలైస్‌ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్‌ 3 పరుగులు చేశారు. ఛార్లోట్‌ డీన్‌ (19), లిన్సే స్మిత్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మతో పాటు శ్రీ చరణి (10-0-68-2) మాత్రమే వికెట్లు తీసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 42 పరుగులకే ప్రతిక రావల్‌ (6), హర్లీన్‌ డియోల్‌ (24) వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతుంది. స్మృతి మంధన (34), కెప్టెన్‌ హర్మన్‌ (33) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 19.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 100/2గా ఉంది. 

చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్‌.. కోహ్లి సరసన గిల్‌
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)