Breaking News

అవమాన భారంతో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్‌

Published on Fri, 10/24/2025 - 21:16

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ నుంచి పాకిస్తాన్‌ జట్టు ఒక్క గెలుపు కూడా లేకుండా అవమాన భారంతో నిష్క్రమించింది. 

శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్‌ 24) జరగాల్సిన వారి చివరి లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా తుడిచిపెట్టుకునపోయింది. దీంతో ప్రస్తుత ఎడిషన్‌లో గెలుపు నోచుకోని ఏకైక జట్టుగా పాక్‌ టోర్నీ నుంచి వైదొలిగింది.

టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా సహా అగ్రశ్రేణి జట్లనన్నిటినీ ఓడిస్తామని ప్రగల్బాలు పలికిన పాక్‌ ప్లేయర్లు.. తొలి మ్యాచ్‌లోనే వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్‌ చేతిలోనే ఓడారు. టోర్నీ మొత్తంలో 7 మ్యాచ్‌లు ఆడి 4 పరాజయాలు ఎదుర్కొన్నారు. 3 మ్యాచ్‌లు వర్షం​ కారణంగా రద్దయ్యాయి. 

భారత్‌పై ఏదో పొడిచేస్తామని బీరాలు పలికిన పాక్‌ 88 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆతర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో కూడా అవమానకర ఓటములు ఎదుర్కొంది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంకతో మ్యాచ్‌లు రద్దయ్యాయి.

ఇవాళ శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌కు ఆది నుంచే వరుణుడు అడ్డు తగిలాడు. కొన్ని గంటల తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో టాస్‌ పడింది. శ్రీలంక టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకోగా.. 4.2 ఓవర్ల తర్వాత మరోసారి భారీ వర్షం మొదలైంది. దీంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి పాక్‌ వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే పాక్‌, శ్రీలంక జట్లు ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యాయి. ఈ రెండు జట్లతో పాటు బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ కూడా నిష్క్రమించాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. 

పాయింట్ల పట్టికలో భారత్‌ నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. తొలి మూడు స్థానాల కోసం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. సెమీస్‌కు చేరిన నాలుగు జట్లు ఇంకా తలో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. రేపటి మ్యాచ్‌లో (అక్టోబర్‌ 25) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడనుండగా.. 26న ఉదయం మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌.. మధ్యాహ్నం మ్యాచ్‌లో భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీకొంటాయి.

చదవండి: ప్రపంచకప్‌ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)