Breaking News

ముక్కోణపు వన్డే సిరీస్‌.. టీమిండియా భారీ స్కోర్‌

Published on Tue, 04/29/2025 - 14:03

శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌-2025లో భారత్‌ ఇవాళ (ఏప్రిల్‌ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ప్రతిక రావల్‌ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41), జెమీమా రోడ్రిగెజ్‌ (41), స్మృతి మంధన (36), హర్లీన్‌ డియోల్‌ (29), రిచా ఘోష్‌ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. 

భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కు ఔట్‌ కాగా.. కశ్వీ గౌతమ్‌ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్‌, డి క్లెర్క్‌, డెర్క్‌సెన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

కాగా, ఈ ట్రై నేషన్‌ సిరీస్‌లో భారత్‌, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్‌ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్‌ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్‌ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. 29.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్‌ 48 (నాటౌట్‌) పరుగులతో సత్తా చాటారు. 

ఈ టోర్నీలో భారత్‌ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్‌ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)