Breaking News

Ashes Series: తొలి వన్డే ఇంగ్లండ్‌దే.. 2 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం

Published on Thu, 07/13/2023 - 14:47

మల్టీ ఫార్మట్‌ మహిళల యాషెస్‌ సిరీస్‌లో ఆతిధ్య ఇంగ్లండ్‌ పైచేయి సాధిస్తుంది. ఈ సిరీస్‌లో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ ఓడిపోయిన ఇంగ్లండ్‌.. ఆతర్వాత పుంజుకుని 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 3 వన్డేల సిరీస్‌లో తొలి వన్డే నెగ్గి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

తొలి వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. బెత్‌ మూనీ (81 నాటౌట్‌), ఎల్లీస్‌ పెర్రీ (41), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (34), జొనాస్సెన్‌ (30) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌ చెరో 2 వికెట్లు.. కేట్‌ క్రాస్‌, ఎక్లెస్టోన్‌, సారా గ్లెన్‌, అలైస్‌ క్యాప్సీ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. హీథర్‌ నైట్‌ (75 నాటౌట్‌), ట్యామీ బేమౌంట్‌ (47), అలైస్‌ క్యాప్సీ (40), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (31) రాణించడంతో  48.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ 3, జార్జియా వేర్హమ్‌ 2, ఎల్లైస్‌ పెర్రీ, మెగాన్‌ షట్‌, జెస్‌ జోనాస్సెన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జులై 16న జరుగనుంది.

లక్ష్య ఛేదనలో రికార్డు..
ఈ మ్యాచ్‌లో 264 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఇంగ్లండ్‌.. లక్ష్య ఛేదనలో తమ రికార్డును మెరుగుపర్చుకుంది. గతంలో ఇంగ్లండ్‌ అత్యధిక లక్ష్యఛేదన రికార్డు 245/7గా ఉండింది. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఈ రికార్డు సాధించింది. యాషెస్‌ తొలి వన్డే ద్వారా ఇంగ్లండ్‌ వన్డేల్లో తొలిసారి 250 పరుగులకు పైబడిన లక్ష్యాన్ని ఛేదించింది.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?