Breaking News

నిలబడడమే ఆమెకు శాపం.. సంబంధం లేని గొడవ ప్రాణం తీసింది

Published on Tue, 07/11/2023 - 13:26

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ విషాదాన్ని నింపింది. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఒక మహిళా అభిమాని అక్కడ జరిగే గొడవతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికి ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఈ విషాదకర ఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో చోటుచేసుకుంది.

విషయంలోకి వెళితే.. శనివారం బ్రెజిలియన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్స్‌ అయిన పాల్మీరాస్, రైవల్స్‌ ఫ్లెమింగోల మధ్య అలియాంజ్ పార్క్ స్టేడియంలో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు పాల్మీరాస్‌కు మద్దతుగా గాబ్రిలా అనెల్లి హాజరైంది. కాగా అలియాంజ్ పార్క్ స్టేడియం బయట ఉన్న పాల్మీరాస్‌ ఫ్యాన్‌ జోన్‌కు దగ్గర్లో నిలబడడమే గాబ్రిలా చేసిన పాపం. ఏదో విషయమై ఇరుజట్ల మధ్య అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కాసేపటికి రైవల్స్‌ ఫ్లెమింగో ఫ్యాన్స్‌ రాళ్లు, గ్లాస్‌ బాటిల్స్‌తో దాడి చేశారు.

ఈ నేపథ్యంలో ఒక గ్లాస్‌ బాటిల్‌ గాబ్రిలా దిశవైపుగా దూసుకొచ్చింది. ఆ గ్లాస్‌ బాటిల్‌ నేరుగా గాబ్రిలా మెడ నరాన్ని కట్‌ చేసుకుంటూ వెళ్లింది. దీంతో అపస్మారక స్థితిలో అక్కడికక్కడే కుప్పకూలింది గాబ్రిలా. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు. కాగా రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ఆసుపత్రిలో మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక గాబ్రిలా మరణాన్ని ఆమె సోదరుడు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించడం అందరిని కలచివేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రిలా మృతికి కారణమైన రైవల్స్‌ ఫ్లెమింగో అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన చర్య ఒకరి ప్రాణం తీస్తుందని ఊహించలేదని.. బాధితురాలి కుటుంబసభ్యులను క్షమాపణ కోరినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాల్మీరాస్‌ క్లబ్‌ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అభిమాని మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇక గొడవ పడిన అభిమానులను వేరు చేయడానికి పెప్పర్‌ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక మ్యాచ్‌ మాత్రం 1-1తో డ్రాగా ముగిసింది. 

చదవండి: WI Vs IND: జైశ్వాల్‌ ఆడడం ఖాయమా? రోహిత్‌ ప్రశ్నకు రహానే స్పందన

#NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)