Breaking News

WTC 2023-25: ఆసీస్‌కు 4.. టీమిండియాకు 5

Published on Mon, 03/11/2024 - 15:41

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ రెండో టెస్ట్‌ అనంతరం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్స్‌కు చేరే జట్లపై క్లారిటీ వచ్చింది. డబ్యూటీసీ ఫైనల్స్‌ రేసులో మొత్తం తొమ్మిది జట్లు ఉండగా.. భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరడం దాదాపుగా ఖరారైపోయింది. 

ప్రస్తుత సైకిల్‌లో ఆస్ట్రేలియా ఏడులో నాలుగు, భారత్‌ పదిలో ఐదు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా జట్లలో సౌతాఫ్రికా ఎనిమిదిలో ఏడు.. న్యూజిలాండ్‌ ఎనిమిదిలో ఆరు.. పాకిస్తాన్‌ తొమ్మిదిలో ఏడు.. వెస్టిండీస్‌ తొమ్మిదిలో ఏడు.. ఇంగ్లండ్‌ 12కు 12.. బంగ్లాదేశ్‌ పదిలో ఏడు... శ్రీలంక 11లో ఎనిమిది మ్యాచ్‌లు గెలిస్తే డబ్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. 

మిగతా జట్లతో పోలిస్తే.. భారత్‌, ఆసీస్‌లకు ఫైనల్‌కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆసీస్‌ తాము ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు భారత్‌తో (స్వదేశంలో).. రెండు శ్రీలంకతో షెడ్యూలై ఉన్నాయి. 

భారత్‌.. రెండు బంగ్లాదేశ్‌తో (స్వదేశంలో).. మూడు న్యూజిలాండ్‌తో (స్వదేశంలో).. ఐదు ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. వీటిలో టీమిండియా సగం మ్యాచ్‌లు గెలిచినా టీమిండియా సునాయాసంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. 

సౌతాఫ్రికా విషయానికొస్తే.. వెస్టిండీస్‌తో రెండు, బంగ్లాదేశ్‌తో రెండు, శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో రెండు (స్వదేశంలో) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

న్యూజిలాండ్‌.. శ్రీలంకతో రెండు, భారత్‌తో మూడు, ఇంగ్లండ్‌తో మూడు (స్వదేశంలో)

పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌తో రెండు (స్వదేశంలో), ఇంగ్లండ్‌తో మూడు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, వెస్టిండీస్‌తో రెండు

వెస్టిండీస్‌.. ఇంగ్లండ్‌తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), బంగ్లాదేశ్‌తో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో రెండు

ఇంగ్లండ్‌.. వెస్టిండీస్‌తో మూడు (స్వదేశంలో), శ్రీలంకతో మూడు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో మూడు, న్యూజిలాండ్‌తో మూడు

బంగ్లాదేశ్‌.. శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో రెండు, భారత్‌తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), వెస్టిండీస్‌తో రెండు

శ్రీలంక.. బంగ్లాదేశ్‌తో రెండు, ఇంగ్లండ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో రెండు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, ఆస్ట్రేలియాతో రెండు (స్వదేశంలో)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)