Breaking News

IPL 2026: బెంగళూరు స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు!

Published on Tue, 02/10/2026 - 09:05

ఎన్నో ప్రఖ్యాత క్రికెట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఓ ఘోరం తరువాత అపఖ్యాతి పాలైంది. అక్కడ మ్యాచ్‌లను చూడాలనే క్రికెట్‌ అభిమానులు, నగర      వాసుల ఆకాంక్ష ఎప్పుడు తీరేనా? అని ఎదురు చూస్తున్నారు.  బుధవారం ఏదో ఒకటి నిర్ధారణ కానుంది.

సాక్షి బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల నిర్వహణపై అనుమతి గురించి బుధవారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో ఆర్‌సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి క్రికెట్‌ మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడడంతో అప్పటినుంచి ఐపీఎల్‌ సహా అన్నిరకాల మ్యాచ్‌లను నిర్వహించడం లేదు. ఆ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం  మైకేల్‌ కున్హా నేతృత్వంలో ఒక కమిటీతో విచారణ జరిపించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి క్రికెట్‌ పోటీలు నిర్వహించాలంటే ఏమేమి భద్రతా చర్యలు తీసుకోవాలో పలు సిఫారసులు చేసింది. ఇందుకు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) కూడా ఆమోదించింది.  

రేపు సీఎంతో భేటీలో తీర్మానం: హోంమంత్రి 
ఈ నేపథ్యంలో బుధవారం జరిగే  ముఖ్య సమావేశంలో ఐపీఎల్‌ పోటీల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం అధ్యక్షుడు వెంకటేశ్‌ప్రసాద్, అధికార ప్రతినిధి వినయ్‌ మృత్యుంజయ, ఆర్‌సీబీ ప్రతినిధి రాజేశ్‌ మీనన్‌ తనను కలసి మ్యాచ్‌ల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. బెంగళూరులో ఐపీఎల్‌ నిర్వహణకు అనుమతివ్వాలని కోరినట్లు, ఇదే సమయంలో ఈ ఏడాది ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నామో వివరించారన్నారు. తాను సీఎం సిద్ధరామయ్యతో ఈ విషయంపై చర్చించాల్సి ఉందని, అందుకే బుధవారం ఐపీఎల్‌ నిర్వహణపై తుది దఫా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల భద్రత ప్రభుత్వం బాధ్యత అని, తొక్కిసలాటలు వంటివి పునరావృతం కాకూడదని,  జీబీఏ కమిషనర్, నగర పోలీసు కమిషనర్, విద్యుత్‌ తదితర శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తామని        తెలిపారు.  

తీయని వార్త రావచ్చు: వెంకటేశ్‌ 
అభిమానులకు త్వరలోనే తీయని వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్‌ ప్రసాద్‌ తెలిపారు.  హోంమంత్రిని కలసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. వీలయినంత త్వరగా పోటీల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం సూచించిన సిఫార్సులన్నింటినీ తమ అసోసియేషన్‌ పూర్తిగా పాటిస్తుందని చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)