Breaking News

ఇంకెంతకు దిగజారుతావు?.. నఖ్వీ ఓవరాక్షన్‌ మామూలుగా లేదు

Published on Fri, 10/10/2025 - 16:19

ఆసియాక‌ప్‌-2025 ట్రోఫీ వివాదానికి ఇప్పటిలో ఎండ్‌కార్డ్ ప‌డేలా లేదు. ఈ మెగా టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగి దాదాపు వారాలు అవుతున్న‌ప్ప‌టికి ట్రోఫీ ఇంకా టీమిండియా చేతికి రాలేదు. ఈ ట్రోఫీ విష‌యంలో ఏసీసీ చైర్మ‌న్ మొహ్సిన్ నఖ్వీ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

ఇప్ప‌టికే తన చేతుల మీద‌గానే ట్రోఫీ ప్ర‌ధానం చేయాల‌ని మొండిప‌ట్టుతో ఉన్నాడంట‌. కాగా ఆసియాక‌ప్‌ ఫైన‌ల్లో విజ‌యం త‌ర్వాత విన్నింగ్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భార‌త్ ఇష్ట‌ప‌డలేదు. ప్రోటోకాల్ ప్ర‌కారం.. ఏసీసీ చైర్మెన్ ఎవ‌రంటే వారే ట్రోఫీని విజేత‌కు అందించాలి.

కానీ న‌ఖ్వీ ఏసీసీ చీఫ్‌తో పాటు పీసీబీ చైర్మెన్‌, పాకిస్తాన్ మంత్రిగా ఉండ‌డంతో ట్రోఫీని తీసుకోవ‌డానికి టీమిండియా నిరాక‌రిచింది. అత‌డికి బ‌దులుగా యూఏఈ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్‌ల చేతుల మీద‌గా ట్రోఫీని అందుకుంటామ‌ని భార‌త్ తెలియ‌జేసింది. కానీ అందుకు న‌ఖ్వీ ఒప్పుకోలేదు. తీసుకుంటే త‌న నుంచే తీసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. 

టీమిండియా ప్లేయర్లు కూడా వెనక్కి తగ్గకుండా గ్రౌండ్‌లోనే కూర్చోవడం పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది. దీంతో ఘోర అవ‌మానంగా భావించిన న‌ఖ్వీ.. స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విన్న‌ర్స్ మెడ‌ల్స్‌ను తీసుకువెళ్లిపోయాడు. అత‌డి తీరుపై బీసీసీఐ సీరియ‌స్ అయ్యింది. అయితే ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు న‌ఖ్వీ అంద‌జేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ వార్త‌ల‌లో ఎటువంటి నిజం లేదు. ట్రోఫీ ఇంకా న‌ఖ్వీ వ‌ద్దే ఉంది.

"ప్ర‌స్తుతం ఆసియాక‌ప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాల‌యంలో ఉంది. అక్క‌డి అధికారుల‌కు  మొహ్సిన్ నఖ్వీ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఉన్నాయి. త‌న అనుమ‌తి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్ప‌గించ‌కూడ‌ద‌ని అత‌డు సూచించాడు. 

ఎప్పుడైనా కానీ భార‌త జ‌ట్టుకు లేదా బీసీసీఐకి ట్రోఫీ త‌నే అందజేస్తాన‌ని ఏసీసీ అధికారుల‌కు న‌ఖ్వీ చెప్పిన‌ట్లు" పీసీబీ చీఫ్‌ స‌న్నిహితుడు ఒక‌రు పిటిఐకు తెలిపారు.  ఈ ఏడాది నవంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న స‌మావేశాల్లో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్‌కు సారీ చెప్పిన పృథ్వీ షా

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)