Breaking News

లంకతో టెస్ట్‌ సిరీస్‌.. సౌతాఫ్రికాకు బిగ్‌ షాక్‌

Published on Fri, 11/29/2024 - 13:44

సౌతాఫ్రికా స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కమాండింగ్‌ పొజిషన్‌లో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ టెంబా బవుమా (70) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్‌ జయసూర్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే కుప్పకూలింది. జన్సెన్‌ (7/13) కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలతో లంక పతనాన్ని శాశించాడు. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్‌ (13), లహీరు కుమార (10 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా 149 పరుగుల ఆధిక్యంతో  రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.

కీలక ఆల్‌రౌండర్‌కు గాయం
ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా సౌతాఫ్రికా కీలక ఆల్‌రౌండర్‌ వియాన్‌ ముల్దర్‌ గాయపడ్డాడు. లహీరు కుమార బౌలింగ్‌ ముల్దర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా అతని కుడి చేతి మధ్య వేలు ఫ్రాక్చర్‌ అయ్యింది. దీంతో అతను తొలి టెస్ట్‌ మిగతా సెషన్స్‌తో పాటు రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యాడు. రెండో టెస్ట్‌లో ముల్దర్‌ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కీ భర్తీ చేస్తాడని క్రికెట్‌ సౌతాఫ్రికా ప్రకటించింది. ముల్దర్‌ గాయమైనప్పటికీ తొలి ఇన్నింగ్స్‌తో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌ చేయడం​ విశేషం. 
 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)