Breaking News

WI Vs PAK: అథనాజ్‌, రూథర్‌ఫర్డ్‌ మెరుపులు వృథా.. మీరు మారరు!

Published on Mon, 08/04/2025 - 10:00

వెస్టిండీస్‌కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. గత టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతి (WI vs AUS)లో చిత్తుగా ఓడిన విండీస్‌.. తాజాగా పాకిస్తాన్‌కు కూడా పొట్టి సిరీస్‌ (WI vs PAK T20Is)ను సమర్పించుకుంది. ఫ్లోరిడా వేదికగా సోమవారం నాటి మూడో టీ20లో ఓడిపోయి.. 1-2తో పరాజయాన్ని చవిచూసింది.

రాణించిన ఓపెనర్లు
కాగా వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు స్వదేశంలో పాకిస్తాన్‌తో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ జరుగగా.. మొదటి మ్యాచ్‌లో పాక్‌, రెండో మ్యాచ్‌లో విండీస్‌ గెలిచాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్ణయాత్మక మూడో టీ20లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (53 బంతుల్లో 74), సయీమ్‌ ఆయుబ్‌ (66) అర్ధ శతకాలతో రాణించి శుభారంభం అందించారు. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ హసన్‌ నవాజ్‌ (15), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ హ్యారీస్‌ (2) మాత్రం విఫలమయ్యారు.

ఆఖర్లో ఖుష్‌ దిల్‌ (6 బంతుల్లో 11) కాస్త వేగంగా ఆడగా.. ఫాహీమ్‌ అష్రాఫ్‌ (3 బంతుల్లో 10) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాకిస్తాన్‌ 189 పరుగులు సాధించింది. వెస్టిండీస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌, రోస్టన్‌ ఛేజ్‌, షమార్‌ జోసెఫ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

అథనాజ్‌, రూథర్‌ఫర్డ్‌ మెరుపులు వృథా
ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్‌ జెవెల్‌ ఆండ్రూ (15 బంతుల్లో 24) రాణించాడు. కానీ వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ షాయీ హోప్‌ (7) నిరాశపరచగా.. రోస్టన్‌ ఛేజ్‌ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో మరో ఓపెనర్‌ అలిక్‌ అథనాజ్‌, నాలుగో నంబర్‌ బ్యాటర్‌ షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అథనాజ్‌ 40 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 60 పరుగులు చేయగా.. రూథర్‌ఫర్డ్‌ 35 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు.

అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం లభించలేదు. హోల్డర్‌ డకౌట్‌ కాగా.. రొమారియో షెఫర్డ్‌ (4), గుడకేష్‌ మోటి (10) ఆఖరి వరకు అజేయంగా నిలిచినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసిన వెస్టిండీస్‌.. విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

ఫలితంగా పర్యాటక పాకిస్తాన్‌ టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ, మొహమ్మద్‌ నవాజ్‌, హ్యారీస్‌ రవూఫ్‌, సయీమ్‌ ఆయుబ్‌, సూఫియాన్‌ ముకీం ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

కాగా గత టీ20 సిరీస్‌లో విండీస్‌.. ఆసీస్‌ చేతిలో సొంతగడ్డపై 5-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘మీరు మారరు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా విండీస్‌ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: ఇంజక్షన్‌ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్‌ గిల్‌

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)