Breaking News

ఉతికి ఆరేసిన బట్లర్‌.. 115 మీటర్ల భారీ సిక్సర్‌

Published on Mon, 11/11/2024 - 16:03

వెస్టిండీస్‌తో నిన్న (నవంబర్‌ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్‌ 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్‌ సునామీ ఇన్నింగ్స్‌ కారణంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో బట్లర్‌ బాదిన ఓ సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. గుడకేశ్‌ మోటీ బౌలింగ్‌ బట్లర్‌ బాదిన ఈ సిక్సర్‌ 115 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఇది జరిగింది. మోటీ లెంగ్త్‌ బాల్‌ను వేయగా.. బట్లర్‌ క్రీజ్‌ దాటి ముందుకు వచ్చి భారీ షాట్‌ ఆడాడు. బట్లర్‌ హార్డ్‌ హిట్టింగ్‌ దెబ్బకు బంతి స్టేడియం దాటి బయటపడింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వెస్టిండీస్‌ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. బట్లర్‌ ఉతికి ఆరేయడంతో 14.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. విల్‌ జాక్స్‌ (29 బంతుల్లో 38) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించగా.. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (23 నాటౌట్‌), జాకబ్‌ బేతెల్‌ (2 నాటౌట్‌) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. 

తొలి టీ20లో మెరుపు సెంచరీ చేసిన ఫిల్‌ సాల్ట్‌ ఈ మ్యాచ్‌లో గోల్డన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెపర్డ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. అకీల్‌ హొసేన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అంతకుముందు విండీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్‌మన్‌ పావెల్‌ 41 బంతుల్లో 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రొమారియో షెపర్డ్‌ (22), నికోలస్‌ పూరన్‌ (14), రోస్టన్‌ ఛేజ్‌ (13), మాథ్యూ ఫోర్డ్‌ (13 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో మౌస్లీ, లివింగ్‌స్టోన్‌, సకీబ్‌ మహమూద్‌ తలో 2 వికెట్లు తీసి విండీస్‌ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. సెయింట్‌ లూసియా వేదికగా నవంబర్‌ 14న మూడో టీ20 జరుగనుంది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)