Breaking News

WI VS ENG 1st T20: ఫిల్‌ సాల్ట్‌ సరికొత్త చరిత్ర

Published on Sun, 11/10/2024 - 18:20

ఇంగ్లండ్‌ ఆటగాడు ఫిలిప్‌ సాల్ట్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సాల్ట్‌ వెస్టిండీస్‌పై మూడు సెంచరీలు చేశాడు. సాల్ట్‌ తన టీ20 కెరీర్‌లో చేసిన మూడు సెంచరీలు విండీస్‌పై చేసినవే కావడం విశేషం. సాల్ట్‌ తర్వాత ఒకే దేశంపై అత్యధిక​ సెంచరీలు చేసిన ఘనత ఎవిన్‌ లెవిస్‌ (భారత్‌పై 2), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (భారత్‌పై 2), ముహమ్మద్‌ వసీం (ఐర్లాండ్‌పై 2)​, లెస్లీ డన్బర్‌లకు (బల్గేరియాపై 2) దక్కుతుంది.

బాబర్‌ ఆజమ్‌ రికార్డును సమం చేసిన సాల్ట్‌
తాజాగా విండీస్‌పై చేసిన సెంచరీతో సాల్ట్‌ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. సాల్ట్‌ 34 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేసి మ్యాక్స్‌వెల్‌ (5 సెంచరీలు), రోహిత్‌ శర్మ (5), సూర్యకుమార్‌ యాదవ్‌ (4), ఎస్‌ డవిజి (3) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. టీ20ల్లో సాల్ట్‌, డవిజి సహా ముహమ్మద్‌ వసీం​, కొలిన్‌ మున్రో, బాబర్‌ ఆజమ్‌లు తలో మూడు సెంచరీలు చేశారు. 

కాగా, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫిల్‌ సాల్ట్‌ మెరుపు సెంచరీతో (54 బంతుల్లో 103 నాటౌట్‌; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో నికోలస్‌ పూరన్‌ (38), రొమారియో షెపర్డ్‌ (35 నాటౌట్‌), గుడకేశ్‌ మోటీ (33), ఆండ్రీ రసెల్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సకీబ్‌ మహమూద్‌ నాలుగు, ఆదిల్‌ రషీద్‌ మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. సాల్ట్‌ సుడిగాలి శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సాల్ట్‌తో పాటు జాకబ్‌ బేతెల్‌ (58 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో విల్‌ జాక్స్‌ 17 పరుగులు చేయగా.. జోస్‌ బట్లర్‌ గోల్డన్‌ డకౌటయ్యాడు. మోటీ, షెపర్డ్‌కు తలో వికెట్‌ దక్కింది. కాగా, ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)