Breaking News

వెస్టిండీస్‌ బోణీ

Published on Tue, 10/28/2025 - 07:23

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (Bangladesh vs West Indies) వెస్టిండీస్‌ బోణీ కొట్టింది. చట్టోగ్రామ్‌ వేదికగా నిన్న (ఆక్టోబర్‌ 27) జరిగిన తొలి మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

షాయ్‌ హోప్‌ (46 నాటౌట్‌), రోవ్‌మన్‌ పావెల్‌ (44 నాటౌట్‌), అలిక్‌ అథనాజ్‌ (34), బ్రాండన్‌ కింగ్‌ (33) రాణించారు. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 2, రిషద్‌ హొస్సేన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం 166 లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ ఓ మోస్తరు పోరాటం చేసి చేతులెత్తేసింది. 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జేడన్‌ సీల్స్‌, జేసన్‌ హోల్డర్‌ తలో 3 వికెట్లు తీయగా.. అకీల్‌ హొసేన్‌ 2, ఖారీ పియెర్‌, రొమారియో షెపర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిమ్‌ హసన్‌ (33), తౌహిద్‌ హృదోయ్‌ (28), నసుమ్‌ అహ్మద్‌ (20) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ అయిన లిట్టన్‌ దాస్‌ 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా అక్టోబర్‌ 29న జరుగనుంది.

కాగా, ఇరు జట్ల మధ్య తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి, మూడు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌ గెలవగా.. రెండో వన్డేలో వెస్టిండీస్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ పరిమిత ఓవర్లల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. 

చదవండి: ఐసీయూ నుంచి బయటకు! 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)