Breaking News

తొలి టెస్ట్‌లో ఆసీస్‌ చేతిలో ఘోర పరాజయం.. విండీస్‌ హెడ్‌ కోచ్‌కు భారీ షాక్‌

Published on Sun, 06/29/2025 - 16:00

వెస్టిండీస్‌ హెడ్‌ కోచ్‌ డారెన్‌ సామీకి ఐసీసీ భారీ షాకిచ్చింది. అంపైర్‌ నిర్ణయాలను విమర్శించినందుకు గానూ డిమెరిట్‌ పాయింట్‌తో పాటు జరిమానా విధించింది. అంపైర్‌ నిర్ణయాలను విమర్శించడం లేదా వ్యతిరేకించడం ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ లెవెల్‌-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంతో ఐసీసీ సామీపై చర్యలు తీసుకుంది.

అసలేం జరిగిందంటే.. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా జూన్‌ 25 నుంచి 27 మధ్య తేదీల్లో బార్బడోస్‌ వేదికగా విండీస్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ రెండో రోజు థర్డ్‌ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం అయ్యాయి. 

ఇందులో నాలుగు నిర్ణ‌యాలు విండీస్‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. దీనిపై విలేక‌రుల స‌మావేశంలో విండీస్‌ హెడ్‌ కోచ్‌ డారెన్‌ సామీ మాట్లాడుతూ అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. థర్డ్‌ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల మ్యాచ్ త‌మ నుంచి చేజారింద‌ని చెప్పుకొచ్చాడు. 

హోల్డ్‌స్టాక్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. నిర్ణయాలు తీసుకోవడంలో హోల్డ్‌స్టాక్‌ స్థిరత్వాన్ని ప్రశ్నించాడు. గతంలో కూడా హోల్డ్‌స్టాక్ ఇలాగే చేశాడని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో అంపైర్‌ తీరును బహిరంగంగా విమర్శించడం ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఆర్టికల్‌ 2.7 ఉల్లంఘన కిందికి వస్తుంది.

ఇందుకు గానూ సామీకి ఓ డిమెరిట్‌ పాయింట్‌తో పాటు మ్యాచ్‌ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించారు. సామీ తన తప్పును ఒప్పుకోవడంతో అతనిని తదుపరి విచారణకు పిలువలేదు. సామీపై చర్యలు తీసుకున్న విషయాన్ని మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ వెల్లడించాడు.

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో హోల్డ్‌స్టాక్ అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న షాయ్‌ హోప్‌, రోస్టన్‌ ఛేజ్‌ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. టీవీ రీప్లేలు ఈ ఇద్దరు నాటౌట్‌ అని చూపించినా హోల్డ్‌స్టాక్ ఔట్‌గా ప్రకటించాడు. హోప్‌, ఛేజ్‌ ఔట్‌ కావడం ఈ మ్యాచ్‌లో విండీస్‌పై భారీ ప్రభావం చూపించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు రాణించినందుకు విండీస్‌కు స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

అయితే ఈ ఆధిక్యాన్ని విండీస్‌ వెంటనే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుగా ఆడిన ఆసీస్‌ బ్యాటర్లు భారీ స్కోర్‌ చేసి విండీస్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఛేదనలో పూర్తిగా చేతులెత్తేసిన విండీస్‌ 141 పరుగులకే ఆలౌటై 159 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇరు జట్లతో పేసర్లు చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్‌ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది.

 

 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)