Breaking News

అందుకే అప్పుడు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాను: విరాట్ కోహ్లి

Published on Fri, 05/02/2025 - 22:00

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి గ‌తేడాది అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌కు విడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 విజ‌యం అనంత‌రం కోహ్లి త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించి అంద‌రికి షాకిచ్చాడు. అత‌డితో పాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 

అయితే తాజాగా తన రిటైర్మెంట్ వెనక గల కారణాన్ని కోహ్లి వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లి చెప్పుకొచ్చాడు. "టీ20లకు రిటైర్మెంట్ అన్ని ఆలోచించాకే ప్రకటించాను. కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావాలని, వారు సిద్దమయ్యేందుకు కాస్త  సమయం అవసరమని భావించాను.

వారు తదుపరి టీ20 వరల్డ్‌కప్‌కు సిద్దంగా ఉండేందుకు కనీసం రెండేళ్ల సమయమైనా కావాలి. అందుకే వరల్డ్‌కప్ అనంతరం టీ20 క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి పేర్కొన్నాడు. 

కాగా కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పు​కున్నప్పటి ఐపీఎల్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్‌-2025లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు సాధించాడు.  అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో కోహ్లి కొనసాగుతున్నాడు.
చ‌ద‌వండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. సచిన్ రికార్డు బ‌ద్ద‌లు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)